Vande Bharat: వందేభారత్ రెండో ట్రయల్ రన్ పూర్తి.. 180 కి.మీ వేగంతో ప్రయాణం

దేశంలో సొంతంగా తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి ఇలాంటి మొత్తం 75 రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

Vande Bharat: వందేభారత్ రెండో ట్రయల్ రన్ పూర్తి.. 180 కి.మీ వేగంతో ప్రయాణం

Vande Bharat: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండో దశ ట్రయల్ రన్ పూర్తైంది. ఈ ట్రయల్ రన్‌లో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకున్నట్లు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. తాజాగా పరీక్షించిన వందేభారత్ రైలు మూడోది.

Bihar: బిహార్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. రూ.4 కోట్ల నగదు స్వాధీనం

ఈ రైళ్లను దేశీయంగానే సొంతంగా తయారు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని కోట నుంచి మధ్య ప్రదేశ్‌లోని నగ్దా వరకు ఈ రైలు ప్రయాణించింది. ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఇది మూడో రైలు. ఈ ట్రయల్ రన్‌కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు రైల్వే సేఫ్టీ కమిషనర్‌కు పంపిస్తారు. కమిషనర్ అన్ని అంశాల్ని పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాత ఈ రైలు ప్రయాణానికి అనుమతిస్తారు. త్వరలోనే మూడో వందే భారత్ రైలుకు అనుమతి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అనుమతులు రాగానే రైలు సేవలు ప్రారంభమవుతాయి. ఈ రైలును అహ్మదాబాద్-ముంబై మధ్య నడిపే వీలుంది. వందే భారత్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే నిర్వహిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు బదులుగా వీటిని నడపనున్నారు.

Bandi Sanjay Praja Sangrama Yatra End : ముగిసిన బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

వచ్చే ఏడాది ఆగష్టు 15 కల్లా 75 వందేభారత్ రైళ్లను నడపాలన్నది కేంద్ర రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే మూడేళ్లలో కనీసం 400 వందే భారత్ రైళ్లను తీసుకురాబోతుంది. దీనికోసం కనీసం నెలకు మూడు కొత్త రైళ్లను తయారు చేస్తున్నారు. ఇవి అత్యాధునిక సాంకేతికతతో, ప్రయాణికులకు మరింత భద్రతనిస్తాయి. ఆటోమేటిక్ డోర్స్, ఆన్-బోర్డ్ వైఫై, జీపీఎస్ బేస్డ్ ఆడియో, విజువల్ ఇన్ఫర్మేషన్, బయో వాక్యూమ్ టాయిలెట్స్ వంటి అధునాతన ఫీచర్లు దీనిలో ఉండబోతున్నాయి. ఈ రైళ్ల వల్ల ప్రయాణ సమయం కనీసం 25 శాతం తగ్గుతుందని అంచనా.