Jharkhand political crisis: ఝార్ఖండ్‌లో మొదలైన రిసార్ట్ రాజకీయం.. రహస్య ప్రదేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు

ఝార్ఖండ్‌లో రిసార్డు రాజకీయం మొదలైంది. తనపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే, తన పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు సీఎం శిబూసోరెన్. అందుకే తన కూటమి ఎమ్మెల్యేలు చేజారకుండా వారిని రహస్య ప్రదేశానికి తరలించాడు.

Jharkhand political crisis: ఝార్ఖండ్‌లో మొదలైన రిసార్ట్ రాజకీయం.. రహస్య ప్రదేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు

Jharkhand political crisis: ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ముఖ్యమంత్రి శిబూసోరెన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అధికారం కోల్పోకుండా తన కూటమికి చెందిన ఎమ్మెల్యేలను శిబూ సోరెన్ ప్రత్యేక బస్సుల్లో రహస్య ప్రాంతానికి తరలించారు. గనుల లీజు అంశానికి సంబంధించి శిబూ సోరెన్‌ను ఎన్నికల సంఘం శాసన సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది.

NEET 2022: లోదుస్తులు తొలగించిన విద్యార్థులకు మళ్లీ ‘నీట్’ పరీక్ష.. ఎన్‪టీఏ నిర్ణయం

దీనికి అనుకూలంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటే, ఆయన ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందులోనూ అక్కడ ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం. 81 మంది సభ్యులున్న ఝార్ఖండ్‌లో శిబూ సోరెన్‌కు 52 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శిబూ సోరెన్ పార్టీ జేఎమ్ఎమ్ అత్యధికంగా 30 సభ్యులను కలిగి ఉంది. సంకీర్ణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 19 మంది సభ్యులున్నారు. తర్వాత ఆర్‌జేడీ, ఎన్సీపీ, సీపీఎమ్‌లకు ఒక్కో సభ్యులున్నారు. వీరందరి మద్దతుతో శిబూ సోరెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేశ శిబూ సోరెన్‌పై అనర్హత వేటు పడితే, ఆయన పార్టీ బలహీనమయ్యే అవకాశం ఉంది. దీంతో బీజేపీ అవిశ్వాసం పెట్టే అవకాశాలున్నాయి.

Uttar Pradesh: నదిలో పడ్డ ట్రాక్టర్, ట్రాలీ.. 10 మంది రైతుల గల్లంతు

ఇదే జరిగి తన పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్తే.. ఆయన పార్టీ అధికారం కోల్పోవడం ఖాయం. అందుకే ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలు చేజారకుండా వారిని రిసార్టుకు తరలించారు. శనివారం ఉదయం ఆయన ఇంటి నుంచి రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలు రహస్య ప్రదేశానికి బయల్దేరారు. వీళ్లు బీజేపీయేతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ లేదా ఛత్తీస్‌ఘడ్ వెళ్లే అవకాశాలున్నాయి.