Fake Bomb Threat: దుబాయ్ వెళ్తున్న కుటుంబ సభ్యులు.. వాళ్లను ఆపేందుకు విమానంలో బాంబు ఉందని ఫేక్ కాల్.. చివరకు ఏమైందంటే
తన కుటుంబ సభ్యులు దుబాయ్ వెళ్లకుండా ఆపేందుకు, వాళ్లు ప్రయాణించే విమానంలో బాంబు ఉందని బెదిరించాడో వ్యక్తి. దీంతో విమానం నిలిచిపోయింది. పూర్తిగా విమానంలో తనిఖీలు చేసిన పోలీసులు ఏ బాంబూ లేదని తేల్చారు. తర్వాత ఫేక్ కాల్ చేసిన నిందితుడిని పట్టుకున్నారు.

Fake Bomb Threat: తన కుటుంబ సభ్యులు తనను విడిచి దుబాయ్ వెళ్లడం ఇష్టం లేని ఒక వ్యక్తి ఏకంగా విమానంలో బాంబు ఉందని ఫేక్ కాల్ చేసి బెదిరించాడు. దీంతో విమానం నిలిచిపోయింది. ఈ ఘటన శనివారం ఉదయం చెన్నైలో జరిగింది. పూర్తిగా మద్యం తాగి ఉన్న ఒక వ్యక్తిని విడిచి, అతడి కుటుంబ సభ్యులు ఇద్దరు దుబాయ్ వెళ్తున్నారు.
అయితే, ఇది ఇష్టం లేని ఆ వ్యక్తి వాళ్లను ఎలాగైనా ఆపాలనుకున్నాడు. అతడు ఎంత చెప్పినా వినకుండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. వాళ్లను ఎలాగైనా ఆపాలన్న ఉద్దేశంతో, ఆ విమానంలో బాంబు ఉందని పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు.. బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న చెన్నై-దుబాయ్ విమానాన్ని అత్యవసరంగా ఆపేశారు. ప్రయాణికుల్ని దించి పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పట్టుకోగా అసలు విషయం చెప్పాడు.
Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
తన కుటుంబ సభ్యులు దుబాయ్ వెళ్లడం ఇష్టం లేదని, వాళ్లను ఆపాలనే ఉద్దేశంతోనే విమానంలో బాంబు ఉందని కాల్ చేసి బెదిరించినట్లు చెప్పాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విమానం ఉదయం ఏడున్నర గంటలకు బయల్దేరాల్సి ఉంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో దాదాపు ఆరు గంటలుపైనే విమానం నిలిచిపోయింది. విమానంలో దాదాపు 180 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.