Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ధైర్యముంటే కేసీఆర్ ఈ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. హన్మకొండలో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడారు.

Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay slams Kcr

Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని, ధైర్యముంటే సీఎం కేసీఆర్‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ శనివారం హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో బండి సంజయ్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు సంధించారు.

Pawan Kalyan: పర్యావరణంపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్నట్టుండి ప్రేమేందుకో.. వరుస ట్వీట్లలో ప్రశ్నించిన పవన్ కల్యాణ్

‘‘రాష్ట్రంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్దం. ధైర్యముంటే కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలి. బీజేపీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు కేసీఆర్ వచ్చి చేరారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం పని చేస్తుంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు జీతాలు లేవు. ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల ఏమైంది? కేసీఆర్ కుటుంబంపై ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో ఏ కుంభకోణం జరిగినా కేసీఆర్ కుటుంబానికి లింకులు ఉన్నాయి. లిక్కర్ స్కాం నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే కుట్ర చేశారు.

J.P.Nadda: ప్రజలు త్వరలోనే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారు: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా

హిందూ దేవతల్ని అవమానించిన మునావర్ ఫారుఖి కామెడీ షోకు ఎవరు అనుమతిచ్చారు? రెండు వేల మంది పోలీసులతో భద్రత ఎందుకు ఏర్పాటు చేశారు? బీజేపీ ఎప్పుడూ ఏ మతాన్ని కించపర్చదు. బీజేపీని బదునాం చేసేందుకే హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలంటే కేసీఆర్ వణికిపోతున్నారు. తెలంగాణలో ఇతర పార్టీలు పాదయాత్రలు, ఆందోళనలు చేయకూడదా? బలప్రదర్శనకు మేం సిద్ధం. మా కార్యకర్తలపై లాఠీఛార్జి చేసినప్పుడే మేం యుద్ధం ప్రకటించాం. త్వరలో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా నిర్వహిస్తాం’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.