Assam: తీవ్రవాదులతో లింకులు.. మదర్సాలు కూల్చివేస్తున్న అసోం సర్కార్

తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటంతోపాటు, అక్రమంగా నిర్మించిన మదర్సాలను అసోం సర్కారు కూల్చివేస్తోంది. దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు మదర్సాలను కూల్చివేశారు.

Assam: తీవ్రవాదులతో లింకులు.. మదర్సాలు కూల్చివేస్తున్న అసోం సర్కార్

Updated On : August 31, 2022 / 3:30 PM IST

Assam: రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన మదర్సాలను కూల్చివేస్తోంది అసోం సర్కారు. తాజాగా తీవ్రవాద సంస్థ అల్ కాయిదాతోపాటు బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా ఒక ప్రైవేటు మదర్సాను బుధవారం అధికారులు కూల్చివేశారు.

Viral Video: ఇంత నిర్లక్ష్యమా.. అమెజాన్ పార్శిళ్లు విసిరేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్

అధికారులు కూలుస్తున్న మూడో ప్రైవేటు మదర్సా ఇది. తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంగా హఫిజర్ రెహమాన్ అనే మదర్సా టీచర్‌ను ఈ నెల 26న అరెస్ట్ చేయగా, గోల్పారా జిల్లాలో ఇద్దరు ఇమామ్‌లను అరెస్టు చేశారు. వీరి ఆధ్వర్యంలో నడిచే మదర్సాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా కబైతరి ప్రాంతంలోని మదర్సాను బుధవారం ఉదయం బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనికి సంబంధించి మంగళవారమే నోటీస్ ఇచ్చినట్లు, ఇక్కడ ఉన్న 200 మంది విద్యార్థుల్ని స్వస్థలాలకు పంపినట్లు డీఎస్పీ స్వప్నానీల్ డేకా తెలిపారు.

Hari Hara Veera Mallu: పవర్ గ్లాన్స్‌కు టైం ఫిక్స్ చేసిన వీరమల్లు.. ఎప్పుడంటే?

తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండటంతోపాటు, ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్మించారని, అందుకే కూలుస్తున్నామని డీఎస్పీ చెప్పారు. తీవ్రవాద సంస్ధలతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఇప్పటి వరకూ పోలీసులు మదర్సాలకు అనుబంధంగా ఉన్న 37 మంది వ్యక్తుల్ని అరెస్టు చేశారు.