Viral Video: ఇంత నిర్లక్ష్యమా.. అమెజాన్ పార్శిళ్లు విసిరేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్
రైల్వే కార్గోలో వచ్చిన పార్శిళ్లను జాగ్రత్తగా దింపాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పార్శిళ్లను దూరంగా విసిరేస్తున్నారు. దీనివల్ల చాలా వస్తువులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.

Viral Video: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ వీడియో. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పార్శిళ్లను రైల్వే సిబ్బంది ఇష్టమొచ్చినట్లు విసిరేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్ ప్రకారం.. రైల్వే స్టేషన్‌లో కొంత మంది సిబ్బంది రైలు నుంచి పార్శిళ్లను అన్‍లోడ్ చేస్తున్నారు.
Hari Hara Veera Mallu: పవర్ గ్లాన్స్‌కు టైం ఫిక్స్ చేసిన వీరమల్లు.. ఎప్పుడంటే?
అయితే, పార్శిళ్లను జాగ్రత్తగా దింపాల్సిన సిబ్బంది వాటిని నిర్లక్ష్యంగా విసిరేస్తున్నారు. వాటిలో అమెజాన్‌తోపాటు, ఇతర ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలకు చెందిన పార్శిళ్లు ఉన్నాయి. అయితే, వాటిలో ల్యాప్‌టాప్, టీవీలు వంటి సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్ ఉంటే పగిలిపోయే ప్రమాదం ఉంది. మరెన్నో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పార్శిళ్లను జాగ్రత్తగా, ఎలాంటి డ్యామేజ్ జరగకుండా దింపాల్సిన సిబ్బంది దూరంగా విసిరేస్తున్నారు. దీనివల్ల అవి చాలా వరకు డ్యామేజ్ అవకాశాలున్నాయి. ఒక వ్యక్తి పార్శిల్‌ను పైకి విసిరేయడంతో పైనున్న సీలింగ్ ఫ్యాన్‌కు తగిలింది.
ఈ విషయంలో రైల్వే సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెబుతూ ఒక వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల విలువైన వస్తువులు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు.
Amazon & Flipkart parcels ?pic.twitter.com/ihvOi1awKk
— Abhishek Yadav (@yabhishekhd) August 29, 2022