Jharkhand: తక్కువ మార్కులు వేశాడని టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే కొన్నిసార్లు టీచర్లు పిల్లల్ని కొడుతుంటారు. కానీ, ఝార్ఖండ్‌లో మాత్రం పిల్లలే టీచర్‌పై దాడి చేసి కొట్టారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Jharkhand: తక్కువ మార్కులు వేశాడని టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

Updated On : August 30, 2022 / 9:39 PM IST

Jharkhand: ఏదైనా సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తే సాధారణంగా టీచర్లు.. విద్యార్థుల్ని కొడతారు. కానీ, ఝార్ఖండ్‌లో మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. మ్యాథ్స్‌లో మార్కులు తక్కువ వేశాడని విద్యార్థులే టీచర్ని, క్లర్కును కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ఢమ్కా జిల్లా, గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Viral Video: ఆటోపైకెక్కి స్కూల్‌కెళ్తున్న విద్యార్థులు.. జారిపడితే అంతే! కేసు నమోదు.. వీడియో వైరల్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడ ప్రభుత్వ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఈ స్కూలుకు సంబంధించి ఝార్కండ్ అకడమిక్ కౌన్సిల్ తాజాగా తొమ్మిదో తరగతి ఫలితాల్ని విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 32 మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ఆ మార్కులు రావడమంటే ఫెయిల్‌తో సమానమే. తమకు తక్కువ మార్కులు రావడంతో వారిలో కొందరు విద్యార్థులు కోపం తెచ్చుకున్నారు. దీనికి బాధ్యుడు అని భావిస్తూ మ్యాథ్స్ టీచర్‌ను, మార్కులు ఆన్‌లైన్‌లో పెట్టిన క్లర్కును సోమవారం నాడు చెట్టుకు కట్టేసి కొట్టారు. మొత్తం 11 మంది విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డారు. తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు.

Water From Air: గాలి నుంచే మంచి నీళ్లు.. ముంబైలో కొత్త టెక్నాలజీ.. త్వరలోనే అందుబాటులోకి

దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు స్కూలు యాజమాన్యం నిరాకరించింది. బాధిత టీచర్, క్లర్కు కూడా ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారు. ప్రస్తుతం స్కూళ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, పాఠశాల సిబ్బంది చర్యలు తీసుకున్నారు.