Viral Video: ఆటోపైకెక్కి స్కూల్‌కెళ్తున్న విద్యార్థులు.. జారిపడితే అంతే! కేసు నమోదు.. వీడియో వైరల్

చిన్న ఆటోపైన స్కూలు విద్యార్థుల్ని కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా నడుపుతున్నాడో డ్రైవర్. పిల్లల్ని ఆటో పైన ఎక్కించుకోవడమే కాకుండా, వేగంగా, ప్రమాదకరంగా ఆటో నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Viral Video: ఆటోపైకెక్కి స్కూల్‌కెళ్తున్న విద్యార్థులు.. జారిపడితే అంతే! కేసు నమోదు.. వీడియో వైరల్

Viral Video: అప్పుడప్పుడూ కొందరు బస్సుపైకెక్కి ప్రయాణించడం చూసుంటారు. ఇంకొందరు రైళ్ల మీదెక్కి ప్రయాణించడం చూసుంటారు. కానీ, 4 సీటర్ ఆటోపైన కూర్చుని ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా? అది కూడా స్కూల్ విద్యార్థులు. లేదూ అంటారా! అయితే ఈ వీడియో చూడండి.

Viral video: స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ మూర్ఛపోయిన తల్లి.. కాపాడిన పదేళ్ల కొడుకు.. వీడియో వైరల్

కొందరు విద్యార్థులు ఆటో పైకి ఎక్కి ఎంత ప్రమాదకరంగా స్కూలుకు వెళ్తున్నారో. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో తీసిన వీడియో ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిబంధనల ప్రకారం 4 సీటర్ ఆటోలో నలుగురి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదు. అలాంటిది ఆటో నిండుగా విద్యార్థుల్ని కూర్చోబెట్టుకుని, అదీ చాలక ఆటో పైన కూడా ఇంకొందరిని కూర్చోబెట్టుకున్నాడు ఆ డ్రైవర్. వాళ్లను రోజూ అలాగే స్కూలుకు తీసుకెళ్తున్నాడు. పోనీ ఆటోపైన పిల్లలు కూర్చున్నారు.. వాళ్లకేదైనా ప్రమాదం జరుగుతుందేమోనని మెల్లిగా వెళ్తున్నాడా అంటే అదీ కాదు. ర్యాష్ డ్రైవింగ్. పైన కూర్చున్న పిల్లలకు ఏ కొంచెం పట్టుజారినా వాళ్లు కింద పడి పోవడం ఖాయం.

Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా: రేవంత్ రెడ్డి

అలాగైతే గాయపడటమో, ప్రాణాలకు ప్రమాదమో ఏర్పడవచ్చు. అయితే, ఈ అంశానికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతోపాటు, యూపీ పోలీసులను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియోపై పోలీసులు స్పందించారు. నిర్లక్ష్యంగా ఆటో నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.