Water From Air: గాలి నుంచే మంచి నీళ్లు.. ముంబైలో కొత్త టెక్నాలజీ.. త్వరలోనే అందుబాటులోకి

గాలి నుంచే నీళ్లను ఉత్పత్తి చేయాలని ఎప్పట్నుంచో ప్రయోగాలు జరిగాయి. కొంతకాలం క్రితమే ఈ టెక్నాలజీ పూర్తిగా సక్సెస్ అయింది. త్వరలోనే ముంబైలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. గాలి నుంచే నీళ్లను ఉత్పత్తి చేయబోతున్నారు.

Water From Air: గాలి నుంచే మంచి నీళ్లు.. ముంబైలో కొత్త టెక్నాలజీ.. త్వరలోనే అందుబాటులోకి

Water From Air: గాలి నుంచే నీళ్ల ఉత్పత్తి.. అది కూడా 100 శాతం సురక్షితమైన మంచి నీళ్లు. ఔను! త్వరలోనే ముంబై వాసులకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో కొన్నేళ్లుగా జరిగిన పరిశోధనలు ఫలితాల్నిచ్చాయి. దీంతో ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది.

Viral Video: ఆటోపైకెక్కి స్కూల్‌కెళ్తున్న విద్యార్థులు.. జారిపడితే అంతే! కేసు నమోదు.. వీడియో వైరల్

ఈ టెక్నాలజీకి ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే ముంబైలో ఈ టెక్నాలజీతో నీటిని ఉత్పత్తి చేయనున్నారు. ఈ టెక్నాలజీతో తయారైన మెషీన్లను ‘మేఘ్‌దూత్’ పేరుతో ముంబైలోని పలు రైల్వే స్టేషన్లలో ప్రవేశపెట్టబోతున్నారు. వీటిని ‘అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్’ అంటారు. ఈ మెషీన్లు గాలి నుంచి నీటిని తయారు చేస్తాయి. కియోస్క్‌లుగా పిలిచే 17 మెషీన్లను ఆరు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి మెషీన్ (కియోస్క్) రోజుకు వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుంది. వీటి ఏర్పాటు కోసం రైల్వే శాఖ రూ.25 లక్షలకుపైగా ఖర్చు పెడుతోంది.

Viral video: స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ మూర్ఛపోయిన తల్లి.. కాపాడిన పదేళ్ల కొడుకు.. వీడియో వైరల్

ప్రయాణికులు ఈ కియోస్కులలో ఉన్న ట్యాప్‌ల నుంచి బాటిళ్లలో నీళ్లు నింపుకోవచ్చు. దీనికి చార్జీలు వసూలు చేస్తారు. ఒక లీటర్ నీటికి రూ.12 చెల్లించాల్సి ఉంటుంది.