London car: లండన్‌లో పోయిన ఖరీదైన కారు.. పాకిస్తాన్‌లో ప్రత్యక్షం.. ఎలా దొరికిందంటే!
లండన్‌లో కనిపించకుండా రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన బెంట్లీ కారు పాకిస్తాన్‌లో దొరికింది. లండన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ కారును పాకిస్తాన్‌లో అక్కడి అధికారులు గుర్తించారు. ఇంతకీ ఆ కారు పాకిస్తాన్‌లో ఉన్నట్లు ఎలా తెలిసిందంటే..

London car: కొద్దివారాల క్రితం లండన్‌లో కనిపించకుండా పోయిన బెంట్లీ కారు పాకిస్తాన్‌లోని కరాచీలో దొరికింది. బ్రిటన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పాక్ అధికారులు ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. బెంట్లీ మ్యుల్సానే సెడాన్ కారు కొద్ది వారాల క్రితం లండన్‌లో చోరీకి గురైంది. దీని విలువ మన కరెన్సీలో దాదాపు రూ.2.4 కోట్లు ఉంటుంది.
Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్
దీనిపై కారు యజమాని లండన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్నుంచి అధికారులు దీని కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్, కరాచీలోని ఒక ఇంట్లో కారు ఉన్నట్లు లండన్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేశారు. పాకిస్తాన్‌కు చెందిన ‘ద కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (సీసీఈ)’ అధికారులు రంగంలోకి దిగారు. వారు.. తమకు లండన్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు నిర్వహించారు. కరాచీలోని, ఒక ప్రముఖ పోష్ రెసెడిన్షియల్ ఏరియా అయిన డీహెచ్ఏలోని ఒక ఇంట్లో ఈ కారును అధికారులు గుర్తించారు. కారు ఉన్న ఇంటి యజమాని, దానికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు చూపించలేదు. కానీ, కారు పాకిస్తాన్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తోనే ఉండటం విశేషం. అయితే, పాక్ అధికారులు.. తమకు లండన్ అధికారులు చెప్పిన ఇంజిన్ ఛాసిస్ నెంబర్ కూడా పరిశీలించగా, అదే నెంబరని తేలింది.
Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్
దీంతో ఆ కారు లండన్ నుంచి కొట్టుకొచ్చిందని అర్థమైంది. ఇంతకీ ఈ కారు పాకిస్తాన్‌లో ఉన్నట్లు ఎలా తెలిసిందంటే.. ఆ కారులో అమర్చిన అడ్వాన్స్‌డ్ ట్రాకర్ వల్లే. లండన్ నుంచి కారు దొంగిలించుకొచ్చిన వ్యక్తులు, ఆ కారులోంచి ట్రాకర్ తీయడం మర్చిపోయారు. లేదా అందులో ట్రాకర్ ఉంటుందనే సంగతి కూడా వారికి తెలియకుండా ఉండొచ్చు. దీంతో ఆ ట్రాకర్ ఆధారంగా కారు పాకిస్తాన్‌లో ఉన్నట్లు లండన్ అధికారులు గుర్తించారు. ఇక ఈ కారు లండన్ నుంచి పాకిస్తాన్ చేరేందుకు, ఒక యూరప్ కంట్రీకి చెందిన దౌత్యవేత్త సాయం చేసినట్లు సమాచారం. దీనిపై అధికారులు విచారణ సాగిస్తున్నారు.