Home » Author »Narender Thiru
భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు వాళ్ల ప్రాణాలు తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడికి కూడా గాయాలయ్యాయి.
భారతీయులు అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వాడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా అజిత్రోమైసిన్ ఎక్కువగా తీసుకుంటున్నారట. ‘లాన్సెట్’ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఢిల్లీలో బాణసంచాపై నిషేధం విధించింది ఆప్ ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీని ప్రకారం.. బాణసంచా అమ్మినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా నేరమే.
ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన బిహార్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి తేజస్వి యాదవ్ షాకయ్యారు. ఆస్పత్రి పరిసరాలు అధ్వానంగా కనిపించాయి. ఇక సూపరిండెంట్ అయితే, పేషెంట్లను వదిలేసి నిద్రపోయేందుకు రెడీ అవుతూ కనిపించాడు.
ఛార్జర్లు లేకుండా ఐఫోన్లు విక్రయిస్తున్న యాపిల్ సంస్థకు షాక్ ఇచ్చింది బ్రెజిల్. దీనికిగాను ఆ సంస్థకు రూ.19 కోట్ల జరిమానా విధించింది. ఛార్జర్ లేని ఫోన్ల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.
బాలుడిని కరిచిందో పెంపుడు కుక్క. బాధతో ఆ బాలుడు విలవిల్లాడుతున్నా సరే.. ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోలేదు. కాస్సేపటి తర్వాత కుక్కను తీసుకుని వెళ్లిపోయింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళ నిర్లక్ష్యంపై నెటి�
తమిళనాడులోని మధురైలో మల్లెపూల ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ రూ.3,000 వరకు ధర పలుకుతున్నాయి. ఇవి అరుదైన రకానికి చెందిన మల్లెపూలు. అలాగే ఇతర పూల ధరలు కూడా భారీగా పెరిగాయి.
ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఏపీలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు, మూడు రాజధానుల అంశంపై చర్చిస్తారు.
సీపీఎస్ అంశంపై నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ భేటీ కానుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని స్థానంలో జీపీఎస్‌కు అంగీకరించాలని ప్రభుత్వం కోరుతోంది.
పోలీసు డ్యూటీలో ఉంటే, అతడి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. పోలీసు ఇంట్లోకి చొరబడ్డ దొంగలు రూ.10 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్, ఓఆర్ఆర్ చుట్టూ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. వచ్చే వేసవిలోపు ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తుందన్నారు.
బెంగళూరు నగరంలో ఒక యువతి విద్యుత్ షాక్‌కు గురై మరణించింది. అఖిల అనే యువతి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా, అదుపుతప్పి కింద పడబోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా షాక్ తగిలి, ప్రాణాలు కోల్పోయింది.
స్టార్ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాకినాడ కేంద్రీయ విద్యాలయంలోని 5, 6 తరగతులకు చెందిన కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడటం లేదంటూ స్కూల్లోనే కుప్పకూలిపోయారు. కాగా, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
యూపీలోని ఒక జైల్లో ఖైదీలు హెచ్ఐవీ బారిన పడ్డారు. బారాబంకి జిల్లాకు చెందిన జైల్లో ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 26 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. గతంలో కూడా ఇలా పలు కేసులు బయటపడ్డాయి.
ఆసియా కప్, సూపర్-4లో నేడు ఇండియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇండియా ఫైనల్ చేరే అవకాశాలుంటాయి.
సంచలనంగా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుల ఇండ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు ముంబు, బెంగళూరు వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభ ఎన్నిరోజులు జరగాలి అనే అంశంపై ఈ రోజు జరిగే బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తుంటే, ప్రజా సమస్యల్ని లేవనెత్తాలని
తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసేలా ఒత్తిడి తేవడం వల్లే ఒక సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. అధికారులపై తన కేసు విషయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఈ నెల 27 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ సూచించింది.