Home » Author »Narender Thiru
ఐఓఎస్ 16 అప్డేట్ ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయంలోపు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్స్ 8, ఆపై మోడల్స్ అన్నింటికీ ఈ అప్డేట్ ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈ 2020, ఎస్ఈ 2022 మోడల్ ఫోన్లకు కూడా ఈ అప్డేట్ వర్తిస్తుంది.
నోయిడాలో మరో మహిళ, మరో సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడింది. ఇక్కడ కూడా గేటు త్వరగా తెరవలేదనే కారణంతోనే గార్డుపై దాడి చేసింది ఆ మహిళ. గత నెలలో కూడా నోయిడాలో ఒక మహిళ ఇలాగే సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. క్వీన్ మృతిపై సంతాపం ప్రకటించారు. అలాగే నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.
మీ మొబైల్ ఫోన్‌కు కరెంట్ బిల్లు కట్టలేదని, వెంటనే బిల్లు చెల్లించాలని వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిసిటీ బిల్ స్కాంలో ఎక్కువ మంది యూజర్లు నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విచారణ కొనసాగుతుండగానే, ఆ ప్రభుత్వంపై మరో ఫిర్యాదు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. బస్సు కొనుగోళ్లలో ఆప్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని సీబీఐకి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
డోరు తీయడం ఆలస్యమైనందుకు ఒక క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్‌పై, అతడి కుమారుడిపై దాడికి పాల్పడిందో బృందం. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.
ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవుతున్నారు.
వర్ష ప్రభావంతో వరద నీళ్లలో కొట్టుకుపోయింది కారు. దీంతో అందులోని ఇద్దరు మరణించారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది.
కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న కారణంతో కింది స్థాయి సిబ్బంది విషయంలో అనుచితంగా ప్రవర్తించాడో ఎస్పీ. ఒక పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలను లాకప్‌లో ఉంచి తాళం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల�
సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఐఐటీ బాంబే ఈ ఫలితాల్ని విడుదల చేయనుంది. సోమవారం నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్‌ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇండ్లు నీట మునిగాయి. నదిని ఆనుకుని నిర్మించిన ఇండ్లు కూలి పోతున్నాయి. మరికొన్ని ప్రమాదపుటంచున ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లో ఒక బాలుడిపై దాడికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. జైన దేవాలయం సమీపంలోకి వచ్చిన బాలుడిని అక్కడి పూజారి, మరో వ్యక్తి కలిసి చెట్టుకు కట్టేశారు. ఆపై దాడికి పాల్పడ్డారు.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఆ పార్టీ నేత చెలమల కృష్ణారెడ్డి. ఈ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన తాజాగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
పరీక్ష కోసం ప్రాణాలకు తెగించిందో యువతి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి మరీ పరీక్ష రాసేందుకు వెళ్లింది. సోదరుల సాయంతో నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
థానె పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంపై చెట్టు కూలడంతో ఒక మహిళ మరణించింది. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి జరిగింది.
అక్రమ లోన్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతోంది కేంద్రం. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లోన్ యాప్స్ త్వరలో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అనుమతి కలిగిన లోన్ యాప్స్ వివరాలతో ‘వైట్‌లిస్ట్’ సిద్ధం చేయబోతుంది ఆర్బీఐ.
రాబోయే పండుగల సీజన్ సందర్భంగా కోవిడ్ వ్యాప్తి జరగకూడదంటే అర్హులందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కేంద్రం సూచించింది. బూస్టర్ డోసులపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.