Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి.. నదిలో ఈదుకుంటూ వెళ్లిన యువతి.. వీడియో వైరల్

పరీక్ష కోసం ప్రాణాలకు తెగించిందో యువతి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి మరీ పరీక్ష రాసేందుకు వెళ్లింది. సోదరుల సాయంతో నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి.. నదిలో ఈదుకుంటూ వెళ్లిన యువతి.. వీడియో వైరల్

Updated On : September 10, 2022 / 2:08 PM IST

Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించిందో యువతి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయ నగరం పరిధిలో శుక్రవారం జరిగింది.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

స్థానిక చంపావతి నదికి అవతలి వైపు ఉన్న మర్రివలస గ్రామానికి చెందిన కళావతి అనే యువతి విశాఖపట్నంలోని ఒక ప్రేవేటు కంపెనీలో పనిచేస్తూనే చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు శనివారం విశాఖపట్నంలో ఎగ్జామ్ ఉంది. ఆమె సొంతూరైన మర్రివలస నుంచి ఈ పరీక్షకు హాజరవ్వాలంటే చంపావతి నదిని దాటాలి. ప్రస్తుతం ఈ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీళ్లు చాలా లోతుగా కూడా ఉన్నాయి. అయితే, ఈ నది దాటేందుకు పడవ లాంటిదేమీ లేకపోవడతో ఈదుకుంటూ వెళ్లడం ఒక్కటే మార్గం. ఇలాంటి పరిస్థితిలోనూ పరీక్ష రాసేందుకు నిర్ణయించుకున్న ఆమె చంపావతి నదిని ఈదుకుంటూ వెళ్లాలి అనుకుంది.

IPHONE 14: ట్రావెలింగ్ అంటే ఇష్టమా.. ఐఫోన్ 14 ధరలోనే దేశాలు చుట్టి రావొచ్చని తెలుసా?

కళావతి మునిగిపోయేంతకుపైగా లోతు ఉన్నప్పటికీ లెక్క చేయలేదు. నది ఈదేందుకు ఆమె సోదరులిద్దరూ సాయపడ్డారు. వారి సాయంతో నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. అక్కడ ఆమె కోసం ఏర్పాటు చేసిన వాహనంలో విశాఖపట్నం బయలుదేరింది. ఈమె నది ఈదుతున్న దృశ్యాల్ని అక్కడివాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళావతి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.