Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. భారీ వరదలకు కూలుతున్న ఇండ్లు.. వీడియో వైరల్

ఉత్తరాఖండ్‌ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇండ్లు నీట మునిగాయి. నదిని ఆనుకుని నిర్మించిన ఇండ్లు కూలి పోతున్నాయి. మరికొన్ని ప్రమాదపుటంచున ఉన్నాయి.

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. భారీ వరదలకు కూలుతున్న ఇండ్లు.. వీడియో వైరల్

Updated On : September 10, 2022 / 3:41 PM IST

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి కుంభవృష్టి కురుస్తోంది. ముఖ్యంగా దార్‌చల్ పట్టణంలోని పితోరాఘర్ ప్రాంతంలో కుంభవృష్టి ప్రభావానికి 50కిపైగా ఇండ్లు నీట మునిగిపోయాయి. భారత్-నేపాల్ సరిహద్దులోని ఈ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

దీంతో ఈ ప్రాంతంలోని కాళీ నది పొంగి ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంతం కోతకు గురవుతోంది. నది ఒడ్డున ఉన్న చాలా ఇండ్లు ప్రమాదపుటంచున ఉన్నాయి. చాలా ఇండ్లలోకి నీళ్లు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నది ప్రమాదకర స్థాయికి చేరుకున్నందున స్థానికులు నదీ ప్రాంతానికి దూరంగా ఉండాలని, దగ్గరకు వెళ్లకూడదని, బ్రిడ్జిలను కూడా ఉపయోగించకూడదని అధికారులు సూచించారు. ఈ వరదల ప్రభావానికి ఒక మహిళ మరణించింది.

Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి.. నదిలో ఈదుకుంటూ వెళ్లిన యువతి.. వీడియో వైరల్

ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాఖండ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో కూడా భారీ స్థాయిలో వరదలు కురుస్తున్నాయి.