Woman Dies In Thane: భారీ వర్షం కారణంగా గణేష్ మండపంపై కూలిన చెట్టు.. మహిళ మృతి

థానె పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంపై చెట్టు కూలడంతో ఒక మహిళ మరణించింది. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి జరిగింది.

Woman Dies In Thane: భారీ వర్షం కారణంగా గణేష్ మండపంపై కూలిన చెట్టు.. మహిళ మృతి

Updated On : September 10, 2022 / 1:09 PM IST

Woman Dies In Thane: మహారాష్ట్రలోని థానెలో దారుణం జరిగింది. గణేష్ మండపంపై చెట్టు కూలడంతో ఒక మహిళ మృతి చెందింది. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. థానె పట్టణాన్ని కొద్ది రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో తీవ్ర ఆస్తి నష్టంతోపాటు, ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి థానెలో కొల్బాద్ మిత్ర మండలి ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్దకు రాజశ్రీ అనే మహిళ దర్శనానికి వచ్చింది. అయితే, అదే సమయంలో భారీ వర్షం పడింది. అలాగే గాలులు కూడా బలంగా వీయడంతో చెట్టు కూలిపోయింది. ఈ క్రమంలో వర్షం పడకుండా మండపంలో తలదాచుకున్న వారు గాయాలపాలయ్యారు. అందులో రాజశ్రీతోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి.

IPHONE 14: ట్రావెలింగ్ అంటే ఇష్టమా.. ఐఫోన్ 14 ధరలోనే దేశాలు చుట్టి రావొచ్చని తెలుసా?

వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే రాజశ్రీ అనే 55 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ప్రతీక్ అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వర్షాల కారణంగా థానెలో రెండు రోజుల్లోనే ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు గత గురువారం వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు.