PM Narendra Modi: బ్రిటన్ పీఎం లిజ్ ట్రస్‌కు మోదీ ఫోన్.. క్వీన్ ఎలిజబెత్ మృతిపై సంతాపం

క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. క్వీన్ మృతిపై సంతాపం ప్రకటించారు. అలాగే నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.

PM Narendra Modi: బ్రిటన్ పీఎం లిజ్ ట్రస్‌కు మోదీ ఫోన్.. క్వీన్ ఎలిజబెత్ మృతిపై సంతాపం

Updated On : September 11, 2022 / 2:44 PM IST

PM Narendra Modi: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌కు ఫోన్ చేసి, క్వీన్ ఎలిజబెత్ మరణంపై సంతాపం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిటన్ రాణిగా కొనసాగిన క్వీన్ ఎలిజబెత్-2 ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం

ఇప్పటికే మోదీ ఈ అంశంపై సంతాపం ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ రోజు సంతాప దినం కూడా పాటిస్తున్నారు. తాజాగా క్వీన్ ఎలిజబెత్ మృతిపై కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. లిజ్ ట్రస్‌తోపాటు, రాజ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలపై కూడా ఫోన్లో చర్చించినట్లు మోదీతోపాటు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుర్చుకునే అంశంపై, వివిధ రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై లిజ్ ట్రస్‌తో చర్చించినట్లు మోదీ వెల్లడించారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

లిజ్ ట్రస్‌ నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు కూడా తెలిపారు. లిజ్ ట్రస్‌ బ్రిటన్ వ్యాపార, విదేశాంగ సెక్రటరీగా ఉన్న సమయంలో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేశారని మోదీ ప్రశంసించారు.