Chalamala Krishna Reddy: మునుగోడులో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తా: చెలమల కృష్ణారెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఆ పార్టీ నేత చెలమల కృష్ణారెడ్డి. ఈ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన తాజాగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.

Chalamala Krishna Reddy: మునుగోడులో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తా: చెలమల కృష్ణారెడ్డి

Updated On : September 10, 2022 / 2:30 PM IST

Chalamala Krishna Reddy: మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఆ పార్టీ నేత చెలమల కృష్ణారెడ్డి. మునుగోడు టికెట్ కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకుల్లో ఆయన ఒకరు.

Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి.. నదిలో ఈదుకుంటూ వెళ్లిన యువతి.. వీడియో వైరల్

అయితే, పార్టీ అక్కడ పాల్వాయి స్రవంతికి టిక్కెట్ ఇచ్చింది. దీంతో చెలమల కృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారన్న అంచనాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీ గెలుపు కోసం సహకరించాలని కోరారు. దీనిపై చలమల కృష్ణారెడ్డి 10టీవీతో మాట్లాడారు. ‘‘మునుగోడులో టికెట్ వస్తుందని ఆశించాం. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మున్ముందు అవకాశాలు వస్తాయి. కష్టపడి పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. మునుగోడులో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. పార్టీ పెద్దలు ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వస్తారనుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుంది. బీజేపీ మూడో స్థానానికి పరిమితమవుతుంది. రాజగోపాల్ రెడ్డి సర్పంచ్, ఎంపీటీసీలను కొంటున్నారు. పార్టీ మారిన సర్పంచ్, ఎంపీటీసీలు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కేడర్‌ను కొనలేరు.