Rajanna Sircilla: వరదలో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరిని రక్షించిన స్థానికులు

వర్ష ప్రభావంతో వరద నీళ్లలో కొట్టుకుపోయింది కారు. దీంతో అందులోని ఇద్దరు మరణించారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది.

Rajanna Sircilla: వరదలో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరిని రక్షించిన స్థానికులు

Updated On : September 11, 2022 / 11:48 AM IST

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలో కారు కొట్టుకుపోవడంతో ఇద్దరు మరణించారు. కారులోని వ్యక్తులు చల్‌గల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫాజుల్ నగర్ చౌరస్తా కల్వర్టు దగ్గర కారు వరదలో చిక్కుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు జేసీబీ సహాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం

ఇద్దరిని కాపాడగలిగారు. కానీ, కారు నీటిలో కొట్టుకుపోవడంతో అందులోని మరో ఇద్దరు మరణించారు. గంగ అనే వృద్ధ మహిళ, కిట్టు అనే ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు. నీటిలో కొట్టుకుపోయిన కారును కొద్ది దూరంలో స్థానికులు బయటకు తీశారు. అందులోంచి ఇద్దరి మృతదేహాల్ని కూడా వెలికితీశారు. మ‌ృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.