Doctor, Son Beaten: క్లినిక్ డోర్ తీయడం లేటైందని డాక్టర్‌పై దాడి.. కేసు నమోదు.. వీడియోలో రికార్డైన ఘటన

డోరు తీయడం ఆలస్యమైనందుకు ఒక క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్‌పై, అతడి కుమారుడిపై దాడికి పాల్పడిందో బృందం. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.

Doctor, Son Beaten: క్లినిక్ డోర్ తీయడం లేటైందని డాక్టర్‌పై దాడి.. కేసు నమోదు.. వీడియోలో రికార్డైన ఘటన

Updated On : September 11, 2022 / 12:48 PM IST

Doctor, Son Beaten: ఒక క్లినిక్ డోరు తీయడం ఆలస్యమైందని డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు పేషెంట్ బంధువులు. ఈ ఘటన ఈ నెల 6న మహారాష్ట్రలోని బారామతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువరాజ్ గైక్వాడ్ అనే డాక్టర్ ఒక క్లినిక్ నిర్వహిస్తున్నాడు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం

అయితే, ఆ క్లినిక్‌కు ఒక పేషెంట్‌తో కొందరు వ్యక్తులు వచ్చారు. అయితే, లోపల భోజనం చేస్తున్న డాక్టర్ డోర్ తీయడం ఆలస్యం చేశాడు. భోజనం చేసిన తర్వాత డోర్ తీశారు. అప్పటికే ఆలస్యం కావడంతో డోర్ తీయగానే డాక్టర్‌పై పేషెంట్ బంధువులు దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి కొడుకుపై కూడా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యమంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై డాక్టర్ యువరాజ్, అతడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.