Couple killed: భార్యాభర్తల మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి.. ఇద్దరూ మృతి

భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు వాళ్ల ప్రాణాలు తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడికి కూడా గాయాలయ్యాయి.

Couple killed: భార్యాభర్తల మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి.. ఇద్దరూ మృతి

Updated On : September 7, 2022 / 1:40 PM IST

Couple killed: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ వాళ్లిద్దరి ప్రాణాలు తీసింది. ఇద్దరూ కత్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఢిల్లీలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలోని గురు ఆనంద్ నగర్‌లో ఉంటున్న నీరజ్-జ్యోతి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

Firecrackers In Delhi: ఢిల్లీలో బాణసంచా బ్యాన్.. జనవరి 1వరకు నిషేధిస్తూ ప్రభుత్వ నిర్ణయం

వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నీరజ్-జ్యోతి తరచూ గొడవ పడుతూ ఉండేవారు. మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్యా వాగ్వాదం తలెత్తింది. గొడవ పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో వారి పదమూడేళ్ల కొడుకుకు కూడా కత్తితో గాయాలయ్యాయి. వాగ్వాదానికి సంబంధించి పెద్దపెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూశారు. అప్పటికే ముగ్గురూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు.

Indians Use Antibiotics: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్న ఇండియన్స్.. టాప్‌లో అజిత్రోమైసిన్

నీరజ్ చికిత్స పొందుతూ హెడ్గేవార్ ఆస్పత్రిలో మరణించగా, జ్యోతి జీటీబీ ఆస్పత్రిలో మరణించింది. వారి కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడి ఎలా జరిగిందో విచారిస్తున్నారు. కత్తి గాయాలకు కారణం వాళ్లేనా.. లేక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.