Pak Boat Caught: పాక్ బోటులో రూ.200 కోట్ల డ్రగ్స్.. పంజాబ్ జైలు నుంచి ఆర్డర్ చేసిన నైజీరియన్

పాక్ నుంచి దేశానికి అక్రమంగా సరఫరా అవుతున్న డ్రగ్స్‌‌ను భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం పట్టుకున్న పాక్ బోటు నుంచి రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Pak Boat Caught: పాక్ బోటులో రూ.200 కోట్ల డ్రగ్స్.. పంజాబ్ జైలు నుంచి ఆర్డర్ చేసిన నైజీరియన్

Updated On : September 14, 2022 / 4:16 PM IST

Pak Boat Caught: పాకిస్తాన్ బోటు నుంచి రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్ తీరంలో భారత భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. పాక్ నుంచి ఈ డ్రగ్స్ పంజాబ్‌కు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత తీర రక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కలిపి, బుధవారం సంయుక్తంగా ఈ బోట్లను స్వాధీనం చేసుకున్నాయి. జకావు తీరానికి 33 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పాక్ బోటును భారత భద్రతా దళాలు వెంటాడి పట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భారత దళాలకు చెందిన రెండు ఫాస్ట్ అటాక్ బోట్లు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. పాక్ బోటులో 40 కేజీల డ్రగ్స్ లభించాయి. వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుంది. బోటులో ఉన్న ఆరుగురు సిబ్బందిని కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. పంజాబ్‌లోని ఒక జైలు నుంచి ఈ డ్రగ్స్‌కు ఆర్డర్ వచ్చినట్లు తెలిసింది.

Droupadi Murmu: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పంజాబ్ జైల్లో ఉన్న ఒక నైజీరియన్ ఈ దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్‌ను ముందుగా గుజరాత్ రప్పించి, అక్కడ్నుంచి పంజాబ్ తరలించాలని వాళ్ల ప్లాన్. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్, ముంద్రా పోర్టులో 2,998 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.21,000 కోట్లుగా ఉంటుందని అంచనా.