Home » Author »Narender Thiru
త్వరలో టీడీపీ నేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వెల్లడించారు ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతోనే ఈ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.
చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకురావడానికి కేంద్రం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. పూర్తి భద్రతా చర్యల మధ్య బోయింగ్ 747 విమానంలో చీతాల్ని ఇండియా తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ నటి రవీనా టాండన్ షేర్ చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి, టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని దలైలామా అన్నారు.
లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహన రిజిస్ట్రేషన్ వంటి సేవలు పొందేందుకు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి 58 రకాల సేవల్ని ఆన్లైన్ ద్వారానే పొందేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.
మానవ జాతికి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే, పోటీ తత్వం పెరిగి మానవ జాతికే ఎసరుపెడతాయని వారంటున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక స్కూల్లో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. స్కూలు బిల్డింగు పై భాగంలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
లోన్ కట్టలేదని ట్రాక్టర్ తీసుకెళ్తున్న రికవరీ ఏజెంట్.. అడ్డొచ్చిన ట్రాక్టర్ యజమాని కూతురును అదే ట్రాక్టర్ ఎక్కించి చంపాడు. మృతురాలు గర్భిణి. ఈ ఘటన గత గురువారం ఝార్ఖండ్‌లో జరిగింది. ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
తెలంగాణలో వారం రోజుల్లో 10 శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఆదివాసి, బంజారా ఆత్మీయ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రెండు నెలల క్రితం కేరళలో ‘సిట్ ఇన్ ల్యాప్’ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే చోట కలిసి కూర్చోవడం ఇష్టంలేని స్థానికులు, వాళ్లు కూర్చునే బెంచీని మూడు భాగాలుగా విడగొట్టారు. దీనికి నిరసనగా మూడు బెంచీలపై అబ్బాయిల ఒళ్లో అమ
మన దేశంలో ఒకప్పుడు చీతాల్ని పెంపుడు జంతువుల్లాగా ఇండ్లల్లోనే పెంచుకునే వాళ్లు. వాటిని మచ్చిక చేసుకుంటే అవి మనుషులతో ఎంతో దగ్గరగా ఉండేవి. కావాలంటే కొన్ని వీడియోలు, చిత్రాలు కూడా ఉన్నాయి చూడండి.
దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి మూడు సెకండ్లలోనే వంద మీటర్ల దూరం పరుగెత్తగలవు. చాలా కార్ల కంటే ఈ వేగం ఎక్కువ. కానీ, ఎక్కువసేపు ఇదే వేగంతో ప్రయాణించలేవు.
పాక్ తీవ్రవాదుల్ని నిషేధించేందుకు భారత్ చేస్తున్న ప్రతిపాదనల్ని చైనా అడ్డుకుంది. ముంబై దాడుల సూత్రాధారిని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలంటూ ఐరాసలో చేసిన ప్రతిపాదనకు చైనా అడ్డుతగిలింది.
వచ్చే డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఉన్న ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మెవానికి అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2016 నాటి కేసుల�
కొంత కాలంగా కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయని నోకియా సంస్థ తాజాగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఫీచర్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 4జీని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులోనే ఇన్‌బిల్ట్ ఇయర్‌బడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌తోనే వాటిని ఛార్జింగ్ చే
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది.
ఒక యువకుడి మరణం వివాదాస్పదంగా మారింది. చెట్టుకు వేలాడుతూ కనిపించిన అతడి మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని యువకుడి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటన అసోంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివి.
విమోచన దినోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శనివారం సికింద్రాబాద్‌లో భారీ స్థాయిలో విమోచన దినోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్ర
మాజీ స్టార్ క్రికెటర్లతో కలిసి విమానంలో వెళ్తున్న ఫొటోను సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలో సచిన్ పక్కనే యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా అభిమానుల్ని ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు.
టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఒకరినొకరు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు. ఈ ఘటన గత బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగింది.
చైనాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 42 అంతస్తులు కలిగిన బిల్డింగులో మంటలు చెలరేగడంతో, ఆ బిల్డింగులోని డజన్ల కొద్ది ఫ్లోర్లు తగలబడి పోతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.