Jignesh Mevani: గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాక్.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కు జైలు శిక్ష

వచ్చే డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఉన్న ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మెవానికి అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2016 నాటి కేసులో తాజాగా తీర్పు వెలువరించింది.

Jignesh Mevani: గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాక్.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కు జైలు శిక్ష

Updated On : September 16, 2022 / 8:48 PM IST

Jignesh Mevani: గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఉన్న ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మెవానికి అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2016 అల్లర్లకు సంబంధించి మెవానితోపాటు మరో 18 మందికి శిక్ష ఖరారు చేస్తూ శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.

Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్

2016 అక్టోబర్‌లో గుజరాత్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక బిల్డింగ్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ మెవాని నిరసన చేపట్టాడు. అప్పట్లో ఈ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. అనుమతి లేకుండా నిరసన చేపట్టడం, రోడ్డు బ్లాక్ చేయడం వంటి చర్యల ఆధారంగా మెవానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 20 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 2016 నుంచి దీనిపై విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో 20 మందిని నిందితులుగా పేర్కొంటూ, జైలు శిక్ష విధించింది అహ్మదాబాద్ కోర్టు. కాగా, 20 మందిలో ఒకరు మరణించారు.

Sachin Tendulkar: మాజీ స్టార్ ప్లేయర్లతో విమానంలో సచిన్.. అభిమానుల్ని ఏం అడిగాడో తెలుసా!

దీంతో మెవానితోపాటు మరో 18 మందికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. వచ్చే డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఉన్న జిగ్నేష్ మెవాని అరెస్టు కావడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగానే చెప్పాలి. అయితే, ఈ తీర్పుపై మెవాని పై కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది.