Dalai Lama: మోదీకి దలైలామా బర్త్ డే విషెస్.. భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ప్రశంస

భారత ప్రధాని నరేంద్ర మోదీకి, టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని దలైలామా అన్నారు.

Dalai Lama: మోదీకి దలైలామా బర్త్ డే విషెస్.. భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ప్రశంస

Dalai Lama

Updated On : September 17, 2022 / 9:09 PM IST

Dalai Lamag: ప్రధాని మోదీకి టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.

Pregnant Woman: గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన రికవరీ ఏజెంట్.. ట్రాక్టర్ లోన్ కట్టలేదని ఘాతుకం

ఇండియా ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటాన్ని ప్రశంసించారు. ‘‘కరోనా వైరస్ వల్ల వచ్చిన ఇబ్బందుల్ని భారత్ విజయవంతంగా అధిగమించింది. ఇప్పటికి ప్యాండెమిక్ ఇంకా పూర్తవ్వకపోయినా, ఇలాంటి వాటిని ఎదుర్కోవడంలో భారత ముందంజలో ఉంది. దేశంలో ఎక్కువగా యువశక్తి ఉండటం భారత్ బలం. యువత.. దేశాభివృద్ధికి, ప్రజల ఆశల్ని నెరవేర్చడానికి తోడ్పడుతుంది. భారత్ ప్రపంచంలో శక్తివంతమైన, సరైన స్థానంలో ఉంది. భారత సంస్కృతిలో భాగంగా ఉన్న కరుణ.. మనం ప్రేమతో కూడిన, అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు తోడ్పడుతుందని బలంగా నమ్ముతాను.

RTO Services Online: ఆర్‌టీఓ సేవలు ఇకపై ఆన్‌లైన్‌లోనే.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

మహాత్మా గాంధీ అనుసరించిన అహింసా సిద్ధాంతాన్ని ఎంతో గౌరవిస్తాను. భారత ప్రజలు, ప్రభుత్వం 1959 నుంచి టిబెటన్లకు అందిస్తున్న ఆతిథ్యం విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను’’ అని దలైలామా తన ప్రకటనలో పేర్కొన్నారు.