Home » Author »Narender Thiru
ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు భారీ స్థాయిలో రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో క్రికెట్ అభిమానులు, పోలీసులు కూడా గాయపడ్డారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 17న ఎన్నిక జరుగుతుంది. పోటీలో ఎవరు నిలుస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
తెలంగాణలో ప్రతి ఏటా ఘనంగా జరిగే బతుకమ్మ సంబరాలు ఈ నెల 25, ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతాయి. ఈ సారి కూడా మరింత ఉత్సాహంగా వేడుకలు జరుపుకొనేందుకు తెలంగాణ ఆడపడుచులు సిద్ధమవుతున్నార�
హైదరాబాద్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న అభిమానులకు గుడ్ న్యూస్. గురువారం ఉదయం నుంచే టిక్కెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. సాయంత్రం ఐదు గంటల వరకు టిక్కెట్ల విక్రయాలు కొనసాగుతాయి.
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల ఇండ్లు, ఆఫీసులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు వంద మందికిపైగా అరెస్టు చేసింది.
రోడ్డుపై గొడవ పడుతున్న కుర్రాళ్లపైకి దూసుకొచ్చిందో కారు. ఆ గ్యాంగ్‌లో ఇద్దరిని ఢీ కొంది. వాళ్లు కింద పడ్డారు. అయినా ఆ గొడవ ఆగలేదు. కిందపడ్డ వాళ్లు లేచిన వెంటనే తిరిగి గొడవ పడటం ప్రారంభించారు.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన అరుదైన ఘటన ఒడిశాలో జరిగింది. సంబల్పూర్ జిల్లాలో ఒక మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒకరు మగ పిల్లాడు.
చీతాలకు ఆహారంగా జింకల్ని రాజస్థాన్ నుంచి తెప్పించారంటూ జరుగుతున్న ప్రచారంపై బిష్ణోయ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించింది.
జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఒక యజమాని దురాగతానికి పాల్పడ్డాడు. తన దగ్గర పనిచేసే కార్మికుడి ముక్కు కోసేశాడు. కేవలం రూ.2000 ఇవ్వమని అడిగినందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు.
వచ్చే ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మూడు రోజులుగా జింఖానా గ్రౌండ్ వద్ద పడిగాపులు పడుతున్నారు.
మైకేల్ జాక్సన్ ఐకానిక్ స్టెప్స్‌లో ఒకటైన మూన్ వాక్ చాలా మంది చేయడం చాలా సార్లు చూసుంటారు. కానీ, అదే స్టెప్ తలకిందులుగా చేయడం ఎప్పుడైనా చూశారా? అదీ నీళ్లలో. లేదంటే ఈ వీడియో చూడండి.
ట్విట్టర్ యూజర్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ నెల 21 నుంచి ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని అమెరికాకు చెందిన ఒక మీడియా సంస్థ తెలిపింది. అయితే, ఇది పూర్తి స్థాయి ఫీచర్ కాదు.
కాకినాడలో ఒక ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. ఒక మహిళకు ప్రెగ్నెన్సీ రాకుండానే, గర్భం దాల్చిందని నమ్మించి తొమ్మిది నెలలు చికిత్స అందించారు. పరీక్షలు, మందుల పేరిట భారీగా ఖర్చు పెట్టించారు. తీరా తొమ్మిదో నెలలో విషయం బయటపడింది.
రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపైకి వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీలో జరిగింది.
గతేడాది ఆగష్టులో ‘బుల్లెట్టు బండి’ పాటతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది సాయి శ్రియ-అశోక్ జంట. ఇప్పుడు మరోసారి ఆ జంట వార్తల్లోకెక్కింది. కారణం.. సాయి శ్రియ భర్త అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడమే.
ఊరి పొలిమేరలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని సింహం చంపేసింది. బాలుడి వయసు పదిహేను సంవత్సరాలు. ఈ ఘటన గుజరాత్లో మంగళవారం జరిగింది.
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లై పది రోజులే అవుతోంది. కానీ, ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. ఇద్దరిలో భార్య మరణించింది. భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
ఇంతకాలం భారత సైన్యంలో సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వస్తి చెప్పనుంది. నాలుగు స్క్వాడ్రన్లలో ఒక స్క్వాడ్రన్ విమానాలకు ఈ నెల 30న వీడ్కోలు చెప్పనున్నారు. ప్రస్తుతం మన సైన్యంలో 70 మిగ్-21 విమానాలున్నాయి.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను అధికారులు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. బస్సు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తైవాన్‌పై చైనా సైనిక చర్యకు దిగితే, అమెరికా దళాలు తైవాన్‌కు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కొంతకాలంగా తైవాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు బైడెన్ తాజా వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్న