Moonwalk Upside-Down: ఆశ్చర్యం! తలకిందులుగా మూన్ వాక్ స్టెప్.. అదీ నీళ్లలో.. వైరల్ అవుతున్న వీడియో

మైకేల్ జాక్సన్ ఐకానిక్ స్టెప్స్‌లో ఒకటైన మూన్ వాక్ చాలా మంది చేయడం చాలా సార్లు చూసుంటారు. కానీ, అదే స్టెప్ తలకిందులుగా చేయడం ఎప్పుడైనా చూశారా? అదీ నీళ్లలో. లేదంటే ఈ వీడియో చూడండి.

Moonwalk Upside-Down: ఆశ్చర్యం! తలకిందులుగా మూన్ వాక్ స్టెప్.. అదీ నీళ్లలో.. వైరల్ అవుతున్న వీడియో

Updated On : September 21, 2022 / 11:04 AM IST

Moonwalk Upside-Down: మైకేల్ జాక్సన్ ఐకానిక్ స్టెప్స్‌లో ఒకటి మూన్ వాక్. మైకేల్ ఈ డాన్స్ క్రియేట్ చేసి దశాబ్దాలు గడుస్తున్నా దీనికుండే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. చాలా మంది ఈ డాన్స్ స్టెప్ చేస్తుంటారు. మీరూ బోలెడన్నిసార్లు చూసుంటారు.

Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ప్రెగ్నెన్సీ లేకుండానే తొమ్మిది నెలలు చికిత్స.. తీరా డెలివరీ టైమ్‌లో బయటపడ్డ నిజం

కానీ, ఎవరైనా తలకిందులుగా మూన్ వాక్ స్టెప్ చేయడం చూశారా? అదీ నీటిలో? ఏంటీ సాధ్యమేనా అనుకుంటున్నారా! అయితే, ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. గుజరాత్, రాజ్‌కోట్‌కు చెందిన జయ్‌దీప్ గోహిల్ అనే యువకుడు ఈ అరుదైన ఫీట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. జయ్‌దీప్ గోహిల్ ఇండియాలోనే మొట్టమొదటి అండర్ వాటర్ డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనేక టాలెంట్ షోలలో తన అరుదైన ప్రతిభను ప్రదర్శించాడు. నీటిలో పలు రకాల డాన్స్‌లు చేసి నెటిజన్లను ఆకట్టుకుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో హైడ్రోమ్యాన్ పేరుతో ఉన్న తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తాజా అండర్ వాటర్ మూన్ వాక్ స్టెప్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు.

Bullettu Bandi Couple: లంచం తీసుకుంటూ దొరికిన ‘బుల్లెట్టు బండి’ పెళ్లి కొడుకు

తన ఫాలోవర్ల కోరిక మేరకు ఈ స్టెప్ చేసినట్లు పేర్కొన్నాడు. నీటిలో.. అదీ తలకిందులుగా మూన్ వాక్ చేయడంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకు 9 మిలియన్లకుపైగా వ్యూస్, 1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి.

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Hydroman (@hydroman_333)