Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ప్రెగ్నెన్సీ లేకుండానే తొమ్మిది నెలలు చికిత్స.. తీరా డెలివరీ టైమ్‌లో బయటపడ్డ నిజం

కాకినాడలో ఒక ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. ఒక మహిళకు ప్రెగ్నెన్సీ రాకుండానే, గర్భం దాల్చిందని నమ్మించి తొమ్మిది నెలలు చికిత్స అందించారు. పరీక్షలు, మందుల పేరిట భారీగా ఖర్చు పెట్టించారు. తీరా తొమ్మిదో నెలలో విషయం బయటపడింది.

Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ప్రెగ్నెన్సీ లేకుండానే తొమ్మిది నెలలు చికిత్స.. తీరా డెలివరీ టైమ్‌లో బయటపడ్డ నిజం

Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రుల మోసానికి నిదర్శనం ఈ ఘటన. ప్రెగ్నెన్సీ రాకుండానే ఒక మహిళ గర్భం దాల్చిందని నమ్మించి, ఆమెకు 9 నెలలు చికిత్స అందించారు. తీరా డెలివరీ కోసం వెళ్తే అప్పుడు అసలు విషయం చెప్పారు. దీంతో మోసపోయిన దంపతులు న్యాయం కోసం అర్థిస్తున్నారు.

Couple Consumes Poison: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. పది రోజులకే ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, కాకినాడలో జరిగింది. మహాలక్ష్మి, సత్తిబాబు దంపతులకు కొన్నేళ్లక్రితం పెళ్లైంది. గత జనవరిలో కాకినాడ, గాంధీ నగర్‌లో ఉన్న రమ్య ఆస్పత్రికి మహాలక్ష్మిని ఆమె భర్త సత్తిబాబు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లాడు. అప్పట్లో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని రిపోర్టు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ జంట తరచూ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లేవాళ్లు. డాక్టర్లు రెగ్యులర్‌గా స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించి, మందులు రాసిచ్చేవాళ్లు. ఆరో నెలలో స్కానింగ్ తీసి, సెప్టెంబర్ 22న ప్రసవం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లారు. అక్కడ ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మహాలక్ష్మిని పరీక్షించిన వైద్యులు.. అసలు ఆమె గర్భవతే కాదని చెప్పారు.

Bullettu Bandi Couple: లంచం తీసుకుంటూ దొరికిన ‘బుల్లెట్టు బండి’ పెళ్లి కొడుకు

దీంతో ఒక్కసారి షాక్ అయిన మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, ఆమెను తిరిగి కాకినాడలోని రమ్య ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ పరీక్షలు చేసి అసలు సంగతి తేల్చాలి అని అడిగారు. దీంతో పరీక్షలు నిర్వహించిన టెక్నీషియన్.. మహాలక్ష్మి గర్భవతి కాదని చెప్పాడు. దీంతో వాళ్లు మహాలక్ష్మికి చికిత్స చేసిన డాక్టర్‌ను ప్రశ్నించారు. ఆమె గర్భవతి కాకుండానే ఇన్నాళ్లూ పరీక్షలు ఎందుకు నిర్వహించారని, మందులు ఎలా ఇచ్చారని అడిగారు. దీనికి ఆ డాక్టర్ పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో తొమ్మిది నెలలపాటు ఆస్పత్రి చుట్టూ తిరిగి, వేల రూపాయలు ఖర్చు పెట్టి మోసపోయామని బాధిత కుటుంబం వాపోతుంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌పై, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.