Uppal Match: ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం రగడ.. జింఖానా గ్రౌండ్ వద్ద బారులు తీరిన అభిమానులు

వచ్చే ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మూడు రోజులుగా జింఖానా గ్రౌండ్ వద్ద పడిగాపులు పడుతున్నారు.

Uppal Match: ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం రగడ.. జింఖానా గ్రౌండ్ వద్ద బారులు తీరిన అభిమానులు

Updated On : September 21, 2022 / 11:52 AM IST

Uppal Match: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్, హైదరాబాదీలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ టిక్కెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Bullettu Bandi Couple: లంచం తీసుకుంటూ దొరికిన ‘బుల్లెట్టు బండి’ పెళ్లి కొడుకు

ఈ క్రమంలో జింఖానా గ్రౌండ్ వద్ద అభిమానులు మూడు రోజులుగా పడిగాపులు పడుతున్నారు. క్యూలో నిలబడి టిక్కెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, టిక్కెట్ల విక్రయం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. టిక్కెట్లు ఎలా, ఎప్పుడు ఇస్తారు అన్నది తెలియడం లేదు. దీనిపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వైఖరిని నిరిసిస్తూ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్ద ఆందోళన చేపట్టారు. హెచ్‌సీఏ టిక్కెట్లను బ్లాకులో విక్రయిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, వాటిని క్యాన్సిల్ చేసి, డబ్బులు రీఫండ్ చేస్తున్నారని పలువురు చెప్పారు.

Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ప్రెగ్నెన్సీ లేకుండానే తొమ్మిది నెలలు చికిత్స.. తీరా డెలివరీ టైమ్‌లో బయటపడ్డ నిజం

అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అధికారులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. దీంతో టిక్కెట్లకు డిమాండ్ పెరిగింది. ఉప్పల్ స్టేడియంలో 55 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది. కాగా, బ్లాకులో టిక్కెట్లు విక్రయిస్తోంది అంటూ వచ్చిన ఆరోపణలపై హెచ్‌సీఏ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.