Uttar Pradesh Shocker: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. జీతం ఇవ్వమని అడిగినందుకు కార్మికుడి ముక్కు కోసేసిన యజమాని

జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఒక యజమాని దురాగతానికి పాల్పడ్డాడు. తన దగ్గర పనిచేసే కార్మికుడి ముక్కు కోసేశాడు. కేవలం రూ.2000 ఇవ్వమని అడిగినందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Uttar Pradesh Shocker: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. జీతం ఇవ్వమని అడిగినందుకు కార్మికుడి ముక్కు కోసేసిన యజమాని

Updated On : September 21, 2022 / 12:39 PM IST

Uttar Pradesh Shocker: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. బకాయిపడ్డ జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు తన దగ్గర పనిచేసే కార్మికుడిపై యజమాని దురాగతానికి పాల్పడ్డాడు. కత్తితో కార్మికుడి ముక్కు కోశాడు.

Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ప్రెగ్నెన్సీ లేకుండానే తొమ్మిది నెలలు చికిత్స.. తీరా డెలివరీ టైమ్‌లో బయటపడ్డ నిజం

ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్మేష్ అనే 50 ఏళ్ల వ్యక్తి.. లాలూ అనే కాంట్రాక్టర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జన్మేష్‌కు లాలూ రూ.2,000 కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. దీని గురించి జన్మేష్ లాలూని అడిగాడు. తనకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలి అని కోరాడు. దీనికి లాలూ నిరాకరించాడు. ఇది ఇద్దరిమధ్యా వాగ్వివాదానికి దారి తీసింది. దీంతో కోపానికి గురైన లాలూ కత్తి తీసుకుని, జన్మేష్ ముక్కు కోసేశాడు. అనంతరం జన్మేష్‌ను చంపుతానని, తన మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని లాలూ హెచ్చరించాడు.

Uppal Match: ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం రగడ.. జింఖానా గ్రౌండ్ వద్ద బారులు తీరిన అభిమానులు

తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.