Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన అరుదైన ఘటన ఒడిశాలో జరిగింది. సంబల్‌పూర్ జిల్లాలో ఒక మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒకరు మగ పిల్లాడు.

Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ

Updated On : September 22, 2022 / 8:14 AM IST

Quadruplets Joy: ఒక కాన్పులో కవల పిల్లలు (ట్విన్స్) పుట్టడమే ప్రత్యేకమైన విషయం. అలాంటిది ముగ్గురు పిల్లలకు (ట్రిప్లెట్స్) జన్మనివ్వడం అరుదు. మరి నలుగురు పిల్లలకు (క్వాడ్రప్లెట్స్) జన్మనివ్వడమంటే అసాధారణమనే చెప్పాలి.

BiggBoss 6 Day 17 : దొంగా పోలీస్ ఆట.. ఒకర్నొకరు తిట్టుకోవడమే సరిపోయింది..

ఇలాంటి అసాధారణ సంఘటనే జరిగింది ఒడిశాలో. ఒక మహిళ బుధవారం ఏకంగా నలుగురు పిల్లలకు జన్మిచ్చింది. ఒడిశా, సంబల్‌పూర్ జిల్లా, వీర్ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ (విమ్సార్) లో ఈ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. సోనెపూర్ జిల్లా, బంజిపాలి గ్రామానికి చెందిన కుని సునా అనే గర్భిణి పురిటి నొప్పులతో సోమవారం విమ్సార్‌లో చేరింది. కుని సునాకు బుధవారం అర్ధరాత్రి వైద్యులు డెలివరీ చేశారు. ఆమెకు ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. వీరిలో ముగ్గురు ఆడ పిల్లలు కాగా, ఒకరు మగ పిల్లాడు.

Chiranjeevi Congress ID Card : మెగాస్టార్ మావాడే అంటున్న కాంగ్రెస్.. చిరంజీవి పేరుతో ఐడీ కార్డ్ రిలీజ్.. కారణం అదేనా

రాత్రి రెండు గంటల సమయంలో ఇద్దరు ఆడ పిల్లలు పుట్టగా, 02.02 నిమిషాలకు మరో ఆడపిల్ల, 02.04 నిమిషాలకు మగ పిల్లాడు జన్మించినట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తల్లీ, పిల్లలూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. శిశువుల్లో ముగ్గురు తక్కువ బరువుతో ఉండటంతో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచామని డాక్టర్లు చెప్పారు. నలుగురు పిల్లలు పుట్టడం చాలా అరుదుగా జరుగుతుందని, ఇలాంటి సందర్భాల్లో డెలివరీ చేయడం చాలా కష్టంగా మారుతుందని డాక్టర్లు అన్నారు.