Lioness kills: బాలుడిని చంపేసిన ఆడసింహం.. బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసిన అధికారులు
ఊరి పొలిమేరలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని సింహం చంపేసింది. బాలుడి వయసు పదిహేను సంవత్సరాలు. ఈ ఘటన గుజరాత్‌లో మంగళవారం జరిగింది.

Lioness kills: గుజరాత్‌లో దారుణం జరిగింది. పదిహేనేళ్ల బాలుడిని ఆడ సింహం దాడి చేసి చంపేసింది. ఈ ఘటన గుజరాత్, అమ్రెలి జిల్లా, వావ్డి అనే గ్రామంలో మంగళవారం సాయత్రం జరిగింది. రాహుల్ మెస్వానియా అనే బాలుడు ఊరి పొలిమేరలో ఉన్న ఒక చిన్న రోడ్డు గుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా, అటవీ ప్రాంతం నుంచి వచ్చిన సింహం దాడి చేసింది.
BiggBoss 6 Day 16 : “దొంగ-పోలీస్” వేట.. హీటెక్కిన బిగ్‌బాస్ ఆట!
ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన బాలుడి కుటుంబం మధ్య ప్రదేశ్ నుంచి వలస వచ్చి, వ్యవసాయ కూలీగా పని చేస్తోంది. ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు స్పందించారు. బాలుడిని చంపేసిన ఆడ సింహాన్ని పట్టుకుంటామని చెప్పారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మన దేశంలో సింహాలు ఉండే ప్రాంతం గుజరాత్.
Couple Consumes Poison: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. పది రోజులకే ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
ఇక్కడ మాత్రమే ప్రస్తుతం సింహాలు భారీ స్తాయిలో ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో సింహాల సంఖ్య 29 శాతం పెరిగింది. 2015లో 523 సింహాలు ఉండగా, 2020 నాటికి వీటి సంఖ్య 674కు చేరింది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.