Bullettu Bandi Couple: లంచం తీసుకుంటూ దొరికిన ‘బుల్లెట్టు బండి’ పెళ్లి కొడుకు

గతేడాది ఆగష్టులో ‘బుల్లెట్టు బండి’ పాటతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది సాయి శ్రియ-అశోక్ జంట. ఇప్పుడు మరోసారి ఆ జంట వార్తల్లోకెక్కింది. కారణం.. సాయి శ్రియ భర్త అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడమే.

Bullettu Bandi Couple: లంచం తీసుకుంటూ దొరికిన ‘బుల్లెట్టు బండి’ పెళ్లి కొడుకు

Updated On : September 21, 2022 / 10:23 AM IST

Bullettu Bandi Couple: గతేడాది ‘బుల్లెట్ బండి’ పాటతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుంది సాయి శ్రియ-అశోక్ జంట. తమ పెళ్లి బారాత్ సందర్భంగా తన భర్త అశోక్ ఎదురుగా సాయి శ్రియ ‘బుల్లెట్టు బండి’ పాటకు చేసిన డాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

Couple Consumes Poison: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. పది రోజులకే ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

అప్పట్లో డాన్స్‌తో సంచలనంగా నిలిచిన ఈ జంట ప్రస్తుతం మరో అంశంతో వార్తల్లో నిలుస్తోంది. కారణం.. సాయి శ్రియ భర్త లంచం తీసుకుంటూ దొరికిపోవడమే. సాయిశ్రియ విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త అశోక్ బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. అశోక్ తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. అశోక్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Lioness kills: బాలుడిని చంపేసిన ఆడసింహం.. బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసిన అధికారులు

ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం తన దగ్గరికి వచ్చిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అశోక్.. ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత, అతడి ఆఫీసుతోపాటు, నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.