Girl Gang-Raped: దళిత యువతిపై సామూహిక అత్యాచారం.. డీజిల్ పోసి దహనం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై డీజిల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Girl Gang-Raped: దళిత యువతిపై సామూహిక అత్యాచారం.. డీజిల్ పోసి దహనం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Updated On : September 19, 2022 / 12:33 PM IST

Girl Gang-Raped: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. దళిత యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో, బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

అత్యాచార ఘటన రెండు వారాల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని ఫిల్బిత్ జిల్లా, కున్వార్ పూర్ గ్రామంలో జరిగింది. టీనేజర్ అయిన బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. తర్వాత ఆమె శరీరంపై డీజిల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజులుగా లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందింది.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

12 రోజులపాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన బాలిక.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పోస్టుమార్టమ్ తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.