Mann ki Baat: ఛండీఘడ్ ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. భగత్ సింగ్ పేరుతో నామకరణం.. ‘మన్ కీ బాత్’లో మోదీ వెల్లడి

పంజాబ్‌లోని ఛండీఘడ్ ఎయిర్‌పోర్ట్ పేరుకు భగత్ సింగ్ పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలంతా ప్లాస్టిక్ బ్యాగుల బదులు జూట్, కాటన్, అరటి పీచు వంటి సహజ ఉత్పత్తులతో తయారైన బ్యాగులనే వాడాలని చెప్పారు.

Mann ki Baat: ఛండీఘడ్ ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. భగత్ సింగ్ పేరుతో నామకరణం.. ‘మన్ కీ బాత్’లో మోదీ వెల్లడి

Updated On : September 25, 2022 / 12:52 PM IST

Mann ki Baat: పంజాబ్‌లోని ఛండీఘడ్ ఎయిర్‌పోర్ట్ పేరును ‘షాహీద్ భగత్ సింగ్’ ఎయిర్‌పోర్ట్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివారం ‘మన్ కీ బాత్’లో భాగంగా ఈ విషయాన్ని ప్రధాని వెల్లడించారు. 93వ ‘మన్ కీ బాత్’లో భాగంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఆదివారం మాట్లాడారు.

Karnataka: రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయడం కుదరదు.. కొత్త చట్టం తేనున్న కర్ణాటక

‘‘చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఛండీఘడ్ ఎయిర్‌పోర్ట్ పేరును ‘షాహీద్ భగత్ సింగ్’ ఎయిర్‌పోర్ట్‌గా మారుస్తాం. ఈ నెల 28న భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. కొద్ది రోజులుగా అందరూ చీతాల గురించే మాట్లాడుకుంటున్నారు. వాటిని దేశానికి తీసుకొచ్చినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 130 కోట్ల మంది ప్రజలు ఆనందిస్తున్నారు. చీతాల మీద కేంద్రం సాగిస్తున్న కార్యక్రమానికి మీరే ఒక మంచి పేరు సూచించాలి. దీన్ దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవాలి.

Ankita Bhandari: పేదదాన్నే.. కానీ పది వేలకు నన్ను నేను అమ్ముకోలేను.. స్నేహితురాలికి మెసేజ్ చేసిన అంకిత

మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సిద్ధాంతాలు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తాయో ఆయన నేర్పించారు. మన జలవనరులు, సముద్రాలకు వాతావరణ మార్పు పెను సవాలుగా మారింది. బీచుల్లో చాలా మంది చెత్త పడేస్తూ వాటిని కలుషితం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయకుండా బాధ్యతగా ఉండాలి. ప్రజలంతా ప్లాస్టిక్ బదులుగా జూట్, కాటన్, అరటి పీచు వంటి సంప్రదాయ, సహజ సిద్ధమైన వాటితో తయారైన స్థానిక బ్యాగులనే వాడాలి’’ అని మోదీ తన ‘మన్ కీ బాత్’లో పేర్కొన్నారు.