Uttar Pradesh Shocker: పాస్‌పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయి.. ఒంటరిగా ఉండటంతో ఫొటోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన

పాస్‌పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయిపై ఫొటోగ్రాఫర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒంటరిగా ఉండటం చూసి లైంగిక దాడికి యత్నించాడు. దీన్ని ఆ యువతి ప్రతిఘటించింది. అయితే, ఈ విషయం బయట చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు.

Uttar Pradesh Shocker: పాస్‌పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయి.. ఒంటరిగా ఉండటంతో ఫొటోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన

Updated On : September 23, 2022 / 11:02 AM IST

Uttar Pradesh Shocker: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన ఒక అమ్మాయిపై ఫొటోగ్రాఫర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది.

Ind vs Aus: ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం ఎవరూ రావొద్దు.. హెచ్‌సీఏ ప్రకటన.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే జారీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్ల యువతి స్థానికంగా ఉన్న ఫొటో స్డూడియోకు వెళ్లింది. అక్కడ తనకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీయాలని ఫొటోగ్రాఫర్‌ను కోరింది. ఈ సమయంలో అక్కడ ఫొటోగ్రాఫర్, ఆ యువతి తప్ప ఎవరూ లేరు. ఫొటోగ్రాఫర్ సూచన మేరకు యువతి స్టూడియో రూమ్‌లో కూర్చుంది. ఫొటో తీయడానికి వచ్చిన కెమెరామెన్, ఆ అమ్మాయిని డ్రెస్ సర్దుకోమని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే ఆ అమ్మాయి డ్రెస్ సర్దుకుంది. కానీ, ఆ ఫొటోగ్రాఫర్ ఆ యువతి దగ్గరికి వచ్చి తనే డ్రెస్ సర్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె ఒంటిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు.

IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో టీ20.. సిరీస్ గెలవాలంటే నెగ్గాల్సిందే

దీంతో వెంటనే ఆ అమ్మాయి అతడ్ని నెట్టేసి, స్డూడియో నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తర్వాత అతడు ఆమెను బెదిరించాడు. ఈ ఘటన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని మహేంద్ర జైశ్వాల్‌గా గుర్తించారు.