Ind vs Aus: ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం ఎవరూ రావొద్దు.. హెచ్‌సీఏ ప్రకటన.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే జారీ

ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు రావొద్దని సూచించింది హెచ్‌సీఏ. గ్రౌండ్ వద్ద ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే టిక్కెట్లు అందజేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గ్రౌండ్ వద్ద అభిమానులు ఇంకా పడిగాపులు పడుతున్నారు.

Ind vs Aus: ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం ఎవరూ రావొద్దు.. హెచ్‌సీఏ ప్రకటన.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే జారీ

Ind vs Aus: ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం ఎవరూ జింఖానా గ్రౌండ్‌కు రావొద్దని హెచ్‌సీఏ ప్రకటించింది. నిన్న (గురువారం) జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. అయితే, ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు ఈరోజు టిక్కెట్లు అందించనున్నారు. వీరికి జింఖానా గ్రౌండ్ వద్ద టిక్కెట్లు పంపిణీ చేస్తారు.

IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో టీ20.. సిరీస్ గెలవాలంటే నెగ్గాల్సిందే

దీనికోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఆన్‌లైన్‌ రిసిప్ట్, ఆధార్ కార్డు తీసుకురావాలని హెచ్‌సీఏ సూచించింది. నిన్నటి ఘటనల నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు ఇంకా పడిగాపులు పడుతున్నారు. కానీ, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ మాత్రం టిక్కెట్లు అయిపోయాయని ప్రకటించాడు. దీంతో 32 వేల టిక్కెట్లు ఏమయ్యాయని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో ఎన్ని అమ్మారు? ఆన్‌లైన్‌లో ఎన్ని టిక్కెట్లు అమ్మారు? చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో 30 శాతానికి మించి టిక్కెట్లు అమ్మలేదు. అయితే, హెచ్‌సీఏపై వచ్చిన ఆరోపణలపై ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సమాధానం చెప్పనున్నారు అజారుద్దీన్.

CM Nitish Kumar: సోనియాతో భేటీ కానున్న బిహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్

ఈ రోజు మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. హెచ్‌సీఏ వైఫల్యాలు, టిక్కెట్లు అమ్మకాలపై ఆయన ఏం చెబుతారు అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురువారం జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అజారుద్దీన్, హెచ్‌సీఏపై కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపణలున్నాయి. ఆదివారం ఉప్పల్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.