IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో టీ20.. సిరీస్ గెలవాలంటే నెగ్గాల్సిందే

ఇండియా-ఆస్ట్రేలియా మూడో టీ20 శుక్రవారం సాయంత్రం జరగనుంది. నాగ్‌పూర్ వేదికంగా సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు ఇండియాను బౌలింగ్ సమస్య వేధిస్తోంది.

IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో టీ20.. సిరీస్ గెలవాలంటే నెగ్గాల్సిందే

IND vs AUS: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగబోతుంది. నాగ్‌పూర్ వేదికంగా శుక్రవారం సాయంత్రం మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో ఒక మ్యాచ్ ఓటమితో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.

CM Nitish Kumar: సోనియాతో భేటీ కానున్న బిహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్

ఈ మ్యాచ్ గెలిస్తేనే టోర్నీ గెలిచే అవకాశాలుంటాయి. లేదంటే 2-0తో సిరీస్ చేజారిపోతుంది. ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇండియాపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. బౌలింగ్‌లో వైఫల్యాలతో మ్యాచ్‌లు చేజార్చుకుంటున్న ఇండియా తాజాగా బుమ్రాకు చోటు కల్పించే అవకాశం ఉంది. ఇండియాకు బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది. బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లు రాణిస్తుండటంతో ఇండియా మంచి స్కోరే సాధిస్తోంది. కానీ, బౌలింగ్ విభాగంలో మాత్రం పేలవంగా ఉంది. ముఖ్యంగా ఇటీవల ఆఖరి ఓవర్లలో ఒత్తిడికి గురై పేలవంగా బౌలింగ్ చేస్తున్నారు. గెలిచే మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఓటమి పాలవుతోంది ఇండియా. డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేస్తాడని పేరు తెచ్చుకున్న భువనేశ్వర్ గత మ్యాచుల్లో మత్రం వైఫల్యం చెందాడు. ఫలితంగా ఇండియా ఓటమి పాలైంది.

PFI: 15 రాష్ట్రాలు, 93 ప్రదేశాల్లో ఎన్ఐఏ ముమ్మర సోదాలు.. 45 మంది అరెస్ట్

అందుకే ఈ మ్యాచ్‌లో అతడిని తీసుకుంటారా లేదా అనే సందేహం ఉంది. అలాగే గాయం కారణంగా కొంతకాలం నుంచి దూరంగా ఉన్న బుమ్రా ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడుతాడో లేదో చూడాలి. మరో బౌలర్ హర్షల్ పటేల్, స్పిన్నర్ చాహల్ కూడా స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అక్షర్ పటేల్ ఒక్కటే ఇటీవలి కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, బౌలింగ్ విభాగంలో మెరుగైతే భారత్ గెలిచే అవకాశాలుంటాయి. మరోవైపు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ ఇటీవల మెరుగైన ప్రదర్శన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కోహ్లీ గత మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. దినేష్ కార్తీక్ తన ఫినిషింగ్ టచ్ చూపించాల్సిన అవసరం ఉంది. కే.ఎల్.రాహుల్, సూర్యకుమార్, హార్ధిక్ కూడా గతంలోలాగే బ్యాటింగ్‌లో అదరగొడితే భారత్ మ్యాచ్ గెలిచే అవకాశాలుంటాయి.