Himachal Pradesh: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు మృతి.. పది మందికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్‌లో టూరిస్టులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Himachal Pradesh: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు మృతి.. పది మందికి గాయాలు

Updated On : September 26, 2022 / 9:05 AM IST

Himachal Pradesh: టూరిస్టులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడటంతో ఏడుగురు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్, కుల్లు జిల్లాలోని ఘియాగి అనే ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో పడవ మునిగి 24 మంది మృతి.. పలువురు గల్లంతు.. మృతులంతా హిందువులే

బంజార్ వ్యాలీలోని ఘియాగి ప్రాంతంలో, పర్వతం అంచున టూరిస్టులతో ప్రయాణిస్తున్న టెంపో వాహనం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, పది మంది గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న అధికారులు స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ముందుగా ప్రాథమిక చికిత్స నిర్వహించారు.

Indrakeeladri: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు.. పది రోజులు పది అవతారాల్లో అమ్మవారి దర్శనం

అనంతరం ఐదుగురు క్షతగాత్రుల్ని కుల్లులోని జోనల్ హాస్పిటల్‌కు, మరో ఐదుగురిని బంజర్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. ఏడుగురి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో బాధితులు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వాళ్లు. వీరిని రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హరియాణా, ఢిల్లీలకు చెందిన వాళ్లుగా గుర్తించినట్లు స్థానిక ఎస్పీ గురుదేవ్ సింగ్ తెలిపారు.