Home » Author »Narender Thiru
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్ర కోసం సముద్ర తీరంలో ఈత కొట్టేందుకు వచ్చిన విద్యార్థులు గల్లంతయ్యారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు రక్షించారు.
పంజాబ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 93 మంది ఎమ్మెల్యేలు ‘ఆప్’కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని పంజాబ్ సీఎం అన్నారు.
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
ఇకపై డిజిటల్ మీడియా, వెబ్సైట్లతోపాటు, టీవీ ఛానెళ్లలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలు కనిపించవు. ఈ ప్రకటనల్ని ప్రసారం చేయకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
అఫ్ఘనిస్తాన్‌లోని ఒక విద్యా సంస్థలో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. సోమవారం ఒక విద్యా సంస్థకు చెందిన క్లాస్ రూమ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 53 మంది మరణించారు. మృతులంతా మహిళలే.
బెలూన్లలో గాలి నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగింది.
ఈ ఏడాదికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు నోబెల్ బహుమతి లభించింది. అంతరించిపోయిన మానవ జాతి జన్యు ఆవిష్కరణలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఎక్కడపడితే అక్కడ వీడియోలు తీసుకుంటున్నారా? అయితే, ఇకపై జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకున్నందుకు ఒక లేడీ కండక్టర్ ఉద్యోగం కోల్పోయింది.
నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడిని హత్య చేశారు ఇద్దరు దుండగులు. తనను శివుడు కలలో నరబలి కోరినట్లు, అందుకే బాలుడిని చంపినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
కెనడాలో హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ సూచిక బోర్డును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. యాత్ర సందర్భంగా సోమవారం ఆయన ఒకే రోజులో మఠం, మసీదు, చర్చి సందర్శించారు.
తక్కువ ధరలోనే జియో ఫోన్ తీసుకొచ్చిన రిలయన్స్ సంస్థ త్వరలో ల్యాప్‌టాప్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ధర రూ.15,000 వరకు ఉండొచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ ల్యాప్‌టాప్ విడుదల కానుంది.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. 51 ఏళ్ల వయసున్న మస్క్ అంతకంటే తక్కువ వయసున్నట్లుగానే కనిపిస్తాడు. దీనికి గల కారణాన్ని ఆయన ఇటీవల వెల్లడించాడు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను చంపుతామంటూ ఆయనకు ఆదివారం బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఈ కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ఆ పార్టీ అధినేత్రి, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ పాల్గొనబోతున్నారు. ఈ నెల 6న ఆమె యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో విడుదల చేశారు.
జమ్మూ-కాశ్మీర్లో జవాన్లపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒక పోలీసు మరణించగా, మరో సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారబోతుందా? కొత్త పార్టీని స్థాపించడం కంటే ఉన్న పార్టీ పేరు మారిస్తే చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకుంటున్నారా? పార్టీ ప్రకటన కోసం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారా?
అక్కడి జైల్లో ఖైదీలకు దుర్గా నవరాత్రులు చాలా స్పెషల్. ఎందుకు అనుకుంటున్నారా? పండుగ సందర్భంగా నాలుగు రోజులు ఖైదీలకు మంచి ఫుడ్ అందిస్తారు. వెజ్, నాన్-వెజ్ వంటకాలు, స్వీట్లు వడ్డిస్తారు.
పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశం ముగిసింది. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేస్తారు.