Mutton Biryani For Prisoners: ఆ జైల్లో ఖైదీలకు మటన్ బిర్యాని, బెంగాలీ స్వీట్స్.. ఎక్కడో తెలుసా?
అక్కడి జైల్లో ఖైదీలకు దుర్గా నవరాత్రులు చాలా స్పెషల్. ఎందుకు అనుకుంటున్నారా? పండుగ సందర్భంగా నాలుగు రోజులు ఖైదీలకు మంచి ఫుడ్ అందిస్తారు. వెజ్, నాన్-వెజ్ వంటకాలు, స్వీట్లు వడ్డిస్తారు.

Mutton Biryani For Prisoners
Mutton Biryani For Prisoners: జైలు అనగానే ఖైదీలకు కఠినమైన జీవితం ఉంటుంది.. అక్కడ వసతులు, భోజనం కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. వెరైటీ అండ్ టేస్టీ ఫుడ్ తినలేరు అనుకుంటారు అందరూ. ఇది చాలా వరకు వాస్తవం కూడా.
Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. పేలుళ్లకు కుట్ర పన్నిన నిందితుడితోపాటు యువకుల అరెస్ట్
అయితే, అన్ని జైళ్లలోనూ అలాగే ఉంటుందనుకుంటే పొరపాటే. ఒక్క జైల్లో మాత్రం దసరా సందర్భంగా ఖైదీలకు మంచి భోజనం అందిస్తారు. మటన్ బిర్యాని, నవరతన్ కోర్మా వంటి వెరైటీలు వడ్డిస్తారు. ఇంతకీ ఎక్కడా.. అనుకుంటున్నారా? పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో. ఔను.. అక్కడి ఒక జైల్లో ఖైదీలకు స్పెషల్ మీల్స్ అందుతుంది. దుర్గా నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం నాలుగైదు రోజులు వారికి రుచికరమైన భోజనాన్ని అందిస్తారు. దక్షిణ కోల్‌కతాలో ప్రెసిడెన్సీ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ ఉంది. ఇక్కడ దాదాపు 2,500 మంది వరకు ఖైదీలుంటారు. వీరిలో చాలా మంది కరుడుగట్టిన నేరస్తులు కూడా ఉన్నారు. వీళ్లందరికీ దసరా నవరాత్రులు.. దుర్గా పూజల సందర్భంగా ఈ నెల 2-5 వరకు ప్రత్యేక భోజనం అందిస్తారు.
CM KCR New Party: దసరా రోజు మరోసారి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ.. ఆ రోజే కొత్త పార్టీపై ప్రకటన?
ఈ నాలుగు రోజులూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. అన్నీ చాలా స్పెషల్‌గా తయారు చేస్తారు. అందులోనూ మహా అష్టమి రోజు అద్భుతమైన నాన్-వెజ్ వడ్డిస్తారు. కిచిడి, పులావ్, లూచి, దమ్ ఆలూ, పనీర్ మసాలా, నవరతన్ కోర్మా వంటి వెజ్ వంటకాలతోపాటు మటన్ బిర్యాని, మటన్ కాలియా, చిల్లీ చికెన్, ఫ్రైడ్ రైస్, చేపలు, రొయ్యలతో వండిన వంటకాలు అందిస్తారు. ఇక బెంగాలీ స్పెషల్ స్వీట్సైన రసగుల్లా, లడ్డూలు ప్రతి రోజూ అందిస్తారు.