Shri Bhagavad Gita Park: కెనడాలో శ్రీ భగవద్గీత పార్క్ బోర్డు ధ్వంసం.. ఖండించిన భారత్

కెనడాలో హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ సూచిక బోర్డును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది.

Shri Bhagavad Gita Park: కెనడాలో శ్రీ భగవద్గీత పార్క్ బోర్డు ధ్వంసం.. ఖండించిన భారత్

Shri Bhagavad Gita Park: కెనడాలో ఇటీవలే ఏర్పాటు చేసిన శ్రీ భగవద్గీత పార్కు సూచిక బోర్డును కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది. కెనడాలోని బ్రాంప్టన్‌ మన్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత వారమే ఒక పార్కుకు శ్రీ భగవద్గీత పార్కు అని నామకరణం చేశారు.

Rahul Gandhi: ఒక్కరోజులోనే మఠం, మసీదు, చర్చి సందర్శించిన రాహుల్.. జోరుగా సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’

3.75 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. భారత దేశం అవతల హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఏకైక పార్కు ఇదే. అయితే, ఈ పార్కుకు ‘భగవద్గీత పార్కు’గా నామకరణం చేస్తూ ఏర్పాటు చేసిన సూచిక బోర్డును కొందరు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం ఖండించింది. ఇది విద్వేషంతో కూడుకున్న చర్య అని భారత్ వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని, సూచిక బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని కెనడా అధికారులు, పోలీసులను కోరింది. కాగా, ఈ వార్తల్లో నిజం లేదని కెనడా అధికారులు అంటున్నారు.

BiggBoss 6 Day 28 : ఆరోహిని పంపించేశారుగా.. ఏడ్చేసిన శ్రీహాన్.. సూర్యతో కేరళకి స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసిన ఆరోహి..

దీనికి సంబంధించి పూర్తిస్థాయి సూచిక బోర్డును ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇప్పటికే ఏర్పాటు చేసిన బోర్డు ధ్వంసమైనట్లు తమకు సమాచారం లేదని అన్నారు. ఈ పార్కును హిందూ సంస్కృతి ప్రతిబింబించేలా రూపొందించబోతున్నారు. ఈ పార్కులో శ్రీ కృష్ణుడి విగ్రహం, అర్జునుడి విగ్రహంతోపాటు, భగవద్గీతను ప్రతిబింబించే చిత్రాలు, శిల్పాలు ఏర్పాటు చేస్తారు.