Adipurush Teaser: మోస్ట్ అవైటెడ్ ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల.. ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్

ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో విడుదల చేశారు.

Adipurush Teaser: మోస్ట్ అవైటెడ్ ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల.. ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్

Updated On : October 2, 2022 / 7:41 PM IST

Adipurush Teaser: ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైంది. అయోధ్యలో జరిగిన వేడుకలో ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల చేసింది. 1.46 నిమిషాల నిడివితో విడుదలైన ఈ చిత్ర టీజర్ విజువల్ ట్రీట్‌లా ఉంది.

CM KCR New Party: దసరా రోజు మరోసారి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ.. ఆ రోజే కొత్త పార్టీపై ప్రకటన?

నీళ్లలో తపస్సు చేస్తున్న రాముడిగా ప్రభాస్ ఎంట్రీ అదుర్స్ అనిపిస్తోంది. సీతగా కృతి సనన్, పది తలల రావణుడిగా సైఫ్ అలీఖాన్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడితోపాటు, వానర సైన్యాన్ని టీజర్‌లో చూపించారు. యుద్ధ సన్నివేశాల్ని కూడా భారీగానే తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదలవుతుంది. 3డీలో కూడా ఈ సినిమా రాబోతుంది.