Mamata Banerjee: డ్యాన్స్ చేసిన మమతా బెనర్జీ.. దుర్గాపూజ కార్నివాల్‌లో ఆసక్తికర దృశ్యం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ ఆసక్తికర ఘటన దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా కోల్‌కతాలో శనివారం జరిగింది.

Mamata Banerjee: డ్యాన్స్ చేసిన మమతా బెనర్జీ.. దుర్గాపూజ కార్నివాల్‌లో ఆసక్తికర దృశ్యం

Updated On : October 8, 2022 / 9:13 PM IST

Mamata Banerjee: ఎప్పుడూ గంభీరంగా కనిపించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఈ ఆసక్తికర ఘటన కోల్‌కతాలో శనివారం జరిగింది. కోల్‌కతాలో దుర్గా నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయనే సంగతి తెలిసిందే.

Viral Video: షో రూం నుంచి అప్పుడే ఇంటికొచ్చిన కొత్త కారు.. ఎంత పని చేసింది? వీడియోలో రికార్డైన అనూహ్య ఘటన

ఇక్కడి పూజలు, సంప్రదాయానికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది. తాజాగా దుర్గా పూజల సందర్భంగా కోల్‌కతాలో శనివారం ప్రత్యేక కార్నివాల్ నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అత్యంత ఘనంగా ప్రతి ఏటా ఈ వేడుకలు జరుగుతాయి. వీటికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరవుతారు. ఇక శనివారం ఈ కార్యక్రమం సందడిగా సాగింది. దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా అక్కడ గిరిజనులు సంప్రదాయ నృత్యం చేశారు. అయితే, అక్కడే ఉన్న మమతా బెనర్జీ వారితోపాటు కలిశారు.

ఆ బృందం మధ్యలోకి వెళ్లి, వాళ్లతోపాటు డ్యాన్స్ చేశారు. చాలా ఉత్సాహంగా కదిలారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. మమతతోపాటు నటి, టీఎమ్‌సీ ఎమ్మెల్యే జునే మలియాతోపాటు పలువురు ప్రముఖులు కూడా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే మమత ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం చూసి బెంగాల్ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.