Mahindra Scorpio-N: ఈ వెహికిల్ ఇప్పుడు బుక్ చేస్తే మరో రెండేళ్ల తర్వాతే డెలివరీ.. వెయిటింగ్ పీరియడ్‌లో ఇదో రికార్డు

‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థ నుంచి తాజాగా విడుదలైంది ‘స్కార్పియో-ఎన్’. గత నెల నుంచి ఈ వాహనాల డెలివరీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వీటి డెలివరీకి మరో రెండేళ్లు పడుతుంది.

Mahindra Scorpio-N: ఈ వెహికిల్ ఇప్పుడు బుక్ చేస్తే మరో రెండేళ్ల తర్వాతే డెలివరీ.. వెయిటింగ్ పీరియడ్‌లో ఇదో రికార్డు

Updated On : October 8, 2022 / 8:53 PM IST

Mahindra Scorpio-N: కొన్ని వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అది కూడా మార్కెట్లోకి రాకముందే వినియోగదారులు ఎగబడుతుంటారు. అలాంటి వాటిలో ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థ నుంచి వస్తున్న ‘స్కార్పియో-ఎన్’ ఒకటి.

Viral Video: షో రూం నుంచి అప్పుడే ఇంటికొచ్చిన కొత్త కారు.. ఎంత పని చేసింది? వీడియోలో రికార్డైన అనూహ్య ఘటన

ఎందుకంటే ఈ ఎస్‌యూవీ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. గత జూన్ 27న ‘మహీంద్రా స్కార్పియో-ఎన్’ లాంఛ్ అయింది. జూలై 30న బుకింగ్స్ మొదలయ్యాయి. అప్పుడే ఇది రికార్డు సృష్టించింది. బుకింగ్స్ మొదలైన అరగంటలోనే లక్షకుపైగా వాహనాల్ని వినియోగదారులు బుక్ చేసుకున్నారు. అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ విలువే దాదాపు రూ.18,000 కోట్లు ఉంటుందని అంచనా. ఆ తర్వాత ఈ బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ‘స్కార్పియో-ఎన్’కు సంబంధించి జడ్2, జడ్4, జడ్6, జడ్8, జడ్8ఎల్ అనే ఐదు వేరియెంట్లు రిలీజ్ కాబోతున్నాయి. వీటి ధరలు రూ.11.99 లక్షల నుంచి రూ.23.90 లక్షల వరకు ఉండొచ్చు. మార్కెట్లోకి వచ్చేసరికి వీటి ధరల్లో ఇంకా మార్పులు ఉంటాయి.

Mahindra Scorpio-N: మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో-ఎన్.. కేవలం రూ.11.99లక్షలు మాత్రమే

గత నెల 26 నుంచి డెలివరీలు ప్రారంభమయ్యాయి. వచ్చే డిసెంబర్‌కల్లా కనీసం 20,000 వాహనాలను డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ప్రకారం.. జడ్2 సిరీస్ డెలివరీ చేసేందుకు 90-95 వారాలు, జడ్4 వేరియెంట్ కోసం 95-100 వారాలు, జడ్6, జడ్8 వేరియెంట్ల డెలివరీ కోసం 100-105 వారాలు, జడ్8ఎల్ కోసం 85-90 వారాల సమయం పడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన ప్రస్తుతం వాహనం బుక్ చేసుకున్న వారికి డెలివరీ కావాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే.