Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షం.. ఆ విషయంలో యాభై ఏళ్ల రికార్డు బ్రేక్
ఢిల్లీలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు నిర్విరామంగా వర్షం కురిసింది. 24 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడటం 2007 తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు.

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు.. 24 గంటల్లో అత్యధికంగా 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Kapil Dev: అంత ఒత్తిడిగా ఉంటే ఐపీఎల్ ఆడటం మానేయండి.. ఆటగాళ్లకు కపిల్ దేవ్ సలహా
దాదాపు ఒక రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. 2007 తర్వాత ఇలా 24 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అది కూడా అత్యదిక వర్షపాతం నమోదైంది. మరోవైపు అక్కడి వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. మరోవైపు ఉష్ణోగ్రతలో 50 ఏళ్ల రికార్డు బద్దలైంది. కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడా లేదు. ఈ తేడా 2.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలు ఉంటే, గరిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా ఉంది. అంటే గత యాభై ఏళ్లలో రెండింటి మధ్యా ఇంత తక్కువ తేడా ఉండటం కూడా ఇదే మొదటిసారి. చివరిగా 1969లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇంత తక్కువ తేడా కనిపించింది.
ఈ మధ్యలో ఒకసారి 1998, అక్టోబర్ 19న మాత్రం.. రెండింటి మధ్యా 3.1 డిగ్రీల తేడా కనిపించింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని ప్రధాన రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. అయితే, వర్షం కారణంగా అక్కడి వాయు కాలుష్యం బాగా తగ్గింది. వాహనాలు రోడ్లపైకి చేరకపోవడం, గాలిలోని ధూళి వర్షంతో కలిసి కురవడం వల్ల గాలి కాలుష్యం తగ్గింది. ప్రస్తుతం వాయు కాలుష్యం సంతృప్తికర స్థాయిలోనే ఉందని అధికారులు వెల్లడించారు.