Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్.. బెయిల్ నిబంధనల సడలింపు పిటిషన్ కొట్టివేత

గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్.. బెయిల్ నిబంధనల సడలింపు పిటిషన్ కొట్టివేత

Updated On : October 10, 2022 / 3:44 PM IST

Gali Janardhan Reddy: గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో ట్రయల్ మొదలుపెట్టాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

BiggBoss 6 Day 35 : దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఎంట్రీ.. బిగ్‌‌బాస్‌ నుంచి చలాకి చంటి అవుట్..

తన బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి రోజువారీ విచారణ మొదలుపెట్టాలని, ఆరు నెలల్లో ఈ విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి నెల రోజులు మాత్రమే బళ్లారిలో ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.