Zomato Delivery Boy: జొమాటో డెలివరీ బాయ్‌తో సెక్యూరిటీ గార్డు గొడవ.. వీడియో వైరల్.. స్పందించిన పోలీసులు

జొమాటో డెలివరీ బాయ్‌ను హౌజింగ్ సొసైటీలోకి అనుమతించే విషయంలో సెక్యూరిటీ గార్డుకు, డెలివరీ బాయ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

Zomato Delivery Boy: జొమాటో డెలివరీ బాయ్‌తో సెక్యూరిటీ గార్డు గొడవ.. వీడియో వైరల్.. స్పందించిన పోలీసులు

Updated On : October 9, 2022 / 9:33 PM IST

Zomato Delivery Boy: ఒక హౌజింగ్ సొసైటీలోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో జొమాటో డెలివరీ బాయ్‌కు, సెక్యూరిటీ గార్డుకు మధ్య గొడవ తలెత్తింది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని ఒక హౌజింగ్ సొసైటీలోకి ఫుడ్ డెలివరీ చేసేందుకు జొమాటో డెలివరీ బాయ్ వెళ్లాడు.

Passenger: బస్సులో తోటి ప్రయాణికులపై కారం చల్లిన ప్రయాణికుడు.. కారణమేంటో తెలుసా?

అయితే, అక్కడ సెక్యూరిటీ గార్డు అతడిని సొసైటీ లోపలికి అనుమతించలేదు. గేటు దగ్గరే ఆపేశాడు. దీంతో జొమాటో డెలివరీ బాయ్.. సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్టు చేసినట్లు డీసీపీ అశుతోష్ ద్వివేది తెలిపారు.