Videos of Girls: అమ్మాయిల డామిట్రీలో సీసీ కెమెరా.. దుస్తులు మార్చుకుంటుండగా వీడియో రికార్డు.. యజమానిపై ఫిర్యాదు

టూర్ కోసం వచ్చిన అమ్మాయిలు బసే చేసే డామిట్రీలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఓనర్. ఇది తెలియన అమ్మాయిలు అక్కడే దుస్తులు మార్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Videos of Girls: అమ్మాయిల డామిట్రీలో సీసీ కెమెరా.. దుస్తులు మార్చుకుంటుండగా వీడియో రికార్డు.. యజమానిపై ఫిర్యాదు

Updated On : October 10, 2022 / 6:07 PM IST

Videos of Girls: మహిళలు హాస్టళ్లతోపాటు హోటళ్లు, గెస్ట్ హౌజ్‌లు, వాష్ రూమ్స్ వంటి చోటికి వెళ్లినప్పుడు భయపడే పరిస్థితి తలెత్తుతోంది. రహస్యంగా కెమెరాలు ఉంచి, వారికి సంబంధించిన పర్సనల్ వీడియోల్ని చిత్రీకరిస్తుండటమే ఇందుకు కారణం.

Apple Watch: యాపిల్ వాచ్ మరో ఘనత… క్లినికల్ టెస్టుకు ముందే వెల్లడించిన ప్రెగ్నెన్సీ రిజల్ట్

ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గత నెలలో పంజాబ్, చండీఘడ్‌లో వెలుగు చూసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక గెస్ట్ హౌజ్‌లో అమ్మాయిలు బస చేసే డామిట్రీలో యజమాని రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ కెమెరాల్లో వారు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, వారణాసిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 మంది అమ్మాయిలు ఎడ్యుకేషన్ టూర్‌లో భాగంగా, వారణాసి చేరుకున్నారు. అక్కడి జేపీ గెస్ట్ హౌజ్‌లోని డామిట్రీలో అందరూ బస చేశారు. ఈ క్రమంలో అక్కడే దుస్తులు మార్చుకున్నారు. అయితే, ఈ దృశ్యాలు అక్కడ రహస్యంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Cow As National Animal?: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే

కొందరు అమ్మాయిలు.. డామిట్రీలో సీసీ కెమెరాను గుర్తించారు. ఈ విషయంపై గెస్ట్ హౌజ్ ఓనర్, మేనేజర్‌ను ప్రశ్నించారు. ముందుగా వారు సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించారు. తర్వాత ఆ సీసీ కెమెరా పని చేయడం లేదని బుకాయించారు. కానీ, సీసీ కెమెరాకు సంబంధించిన రూమ్‌కు వెళ్లి పరిశీలించగా, అందులో అక్కడి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో అమ్మాయిలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓనర్‌తోపాటు, మేనేజర్‌ను అరెస్టు చేశారు.