Traffic Light: హార్ట్ షేపులో ట్రాఫిక్ రెడ్ లైట్.. బెంగళూరులో మారిన లైట్లు.. ఎందుకు మార్చారో తెలుసా?

బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లలో రెడ్ లైట్ మారిపోయింది. ఇప్పుడా సిగ్నల్స్ వృత్తాకారంలో కాకుండా, హార్ట్ షేపులో కనిపిస్తున్నాయి. అయితే, ఇలా కనిపించడానికి ఒక కారణం ఉంది.

Traffic Light: హార్ట్ షేపులో ట్రాఫిక్ రెడ్ లైట్.. బెంగళూరులో మారిన లైట్లు.. ఎందుకు మార్చారో తెలుసా?

Updated On : October 11, 2022 / 7:23 PM IST

Traffic Light: కర్ణాటక రాజధాని బెంగళూరు మహా నగరంలో ట్రాఫిక్ రెడ్ లైట్ మారిపోయింది. రెడ్ లైట్ హార్ట్ షేపులో కనిపిస్తోంది. దీనికో కారణం ఉంది. ఇటీవల ‘వరల్డ్ హార్ట్ డే’ను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి ట్రాఫిక్ రెడ్ లైట్లను మార్చేశారు.

Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

వాహనదారులకు రెడ్ లైట్.. హార్ట్ షేపులో కనిపించేలా మార్చారు. ప్రజలకు గుండె జబ్బులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ పని చేశారు. స్థానిక మణిపాల్ హాస్పిటల్స్ చొరవతో ఇది అమలవుతోంది. ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే చాలా మంది గుండె జబ్బులకు గురవుతున్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించి, జాగ్రత్తగా ఉండాలని సూచించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లు అన్నింటివద్దా ఇలాగే హార్ట్ షేపులో రెడ్ లైట్ కనిపిస్తుంది. ఐటీకి బెంగళూరు ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. దీన్ని స్మార్ట్ సిటీ అని కూడా అంటారు.

Viral Video: నడిరోడ్డుపై బైక్‌కు అంటుకున్న నిప్పు.. ఎంతమంది కలిసి ఆర్పేశారో.. వీడియో వైరల్

అయితే, దీన్ని ‘హార్ట్ స్మార్ట్ సిటీ’గా మార్చే ఉద్దేశంతో ఈ లైట్లను ఏర్పాటు చేశారు. లైట్లతోపాటు పక్కనే కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో హార్ట్ షేప్ మధ్యలో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీనిపై స్కాన్ చేస్తే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా పొందవచ్చు. వీటితోపాటు ఆడియో, వీడియోల రూపంలో గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకు మణిపాల్ ఆస్పత్రి, అక్కడి ప్రభుత్వం కృషి చేస్తున్నాయి.