Pilot Whales: న్యూజిలాండ్ తీరంలో ఒకేసారి 500 తిమింగలాలు మృతి

న్యూజిలాండ్ తీరంలో మూడు రోజుల వ్యవధిలోనే 500 తిమింగలాలు మరణించాయి. అక్కడి దీవుల్లోని, సముద్ర తీరంలో ఈ తిమింగలాలు మరణించి కనిపించాయి. ఇలా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో తిమింగలాలు మరణించడం అరుదుగా జరుగుతుంది.

Pilot Whales: న్యూజిలాండ్ తీరంలో ఒకేసారి 500 తిమింగలాలు మృతి

Updated On : October 11, 2022 / 4:35 PM IST

Pilot Whales: న్యూజిలాండ్ తీరంలో 500 తిమింగలాలు మృతిచెందాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఈ తిమింగలాలు మరణించినట్లు అధికారులు తెలిపారు. న్యూజిలాండ్‌కు చెందిన మారుమూల చాతమ్ దీవుల్లో, సముద్రపు ఒడ్డున ఈ తిమింగలాలు మరణించి కనిపించాయి.

Kerala Women: కేరళలో నరబలి.. గొంతుకోసి ఇద్దరు మహిళల దారుణ హత్య.. డబ్బు కోసం భార్యాభర్తల దురాగతం

ఇలా గుంపులుగా ఒకేసారి పెద్దమొత్తంలో తిమింగలాలు మరణించడం అరుదుగా జరుగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. గత శుక్రవారం చాతమ్ దీవి వద్ద 250కి పైగా తిమింగలాలు మరణించి కనిపించాయి. మరో మూడు రోజుల తర్వాత సోమవారం కూడా పిట్ ఐలాండ్ తీరంలో 240కిపైగా తిమింగలాలు మరణించాయి. ఇవి పైలట్ వేల్స్ అనే ప్రత్యేక తిమింగలాలు. మరోవైపు తిమింగలాలు మరణించిన ప్రదేశం న్యూజిలాండ్ ప్రధాన భూభాగానికి దూరంగా ఉండటంతో వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. కాగా, షార్క్ చేపల దాడుల వల్లే ఇవి మరణించి ఉండొచ్చని అధికారుల అంచనా. షార్క్ చేపలు పెరిగిపోతుండటం అటు తిమింగలాలు వంటి జలచరాలకే కాకుండా.. మనుషులకు కూడా ప్రమాదకరమే అని వారంటున్నారు.

Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

మరణించిన తిమింగలాల్ని ప్రత్యేకంగా ఎలాంటి ఖననం చేయడం లేదని, సహజ సిద్ధంగానే తీరంలో అవి కుళ్లిపోతాయని అధికారులు చెప్పారు. భారీ స్థాయిలో తిమింగలాలు మరణించడం ఇదే మొదటిసారి కాదు. 1918లో కూడా ఒకసారి వెయ్యికిపైగా తిమింగలాలు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.